గబ్బర్ సింగ్ రిటైర్మెంట్ ఫాన్స్ కు థాంక్స్ చెబుతూ వీడియో

టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

  • Written By:
  • Updated On - August 24, 2024 / 11:27 AM IST

టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గబ్బర్ ఓ వీడియోను విడుదల చేశాడు . తన కెరీర్‌కు అండగా నిలిచిన బీసీసీఐ, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. క్లిష్ట సమయంలోనూ మద్దతు తెలిపిన ఫ్యాన్స్ కృతజ్ఞతలు చెప్పాడు.

2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గబ్బర్
భారత్ తరఫున 167 వన్డేలు, 34 టెస్ట్‌లు, 68 టీ20లు ఆడాడు. వన్డేల్లో 6793, టెస్ట్‌ల్లో 2315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1759 రన్స్ చేసిన గబ్బర్.. వన్డేల్లో 17, టెస్ట్‌ల్లో 7 సెంచరీలు నమోదు చేశాడు. చివరి సారిగా 2022లో వన్డే ఆడిన శిఖర్ ధావన్ యువ క్రికెటర్ల ఎంట్రీతో జట్టులో చోటు కోల్పోయాడు. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికిన గబ్బర్.. ఐపీఎల్‌ ఆడడంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటి వరకూ ఐపీఎల్ లో ధావన్ 222 మ్యాచ్ లు ఆడి 6 వేలకు పైగా రన్స్ చేశాడు.