Shoaib Akhtar: ఇండియా క్రికెట్ టీం ఆసియా కప్‌లో తిరుగులేని ప్రదర్శన చేస్తోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసిన మెన్ ఇన్ బ్లూ.. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచులో కూడా మ్యాజిక్ చేసింది. పాకిస్తాన్ మ్యాచ్‌తో ఎంత మజా వచ్చిందో.. శ్రీలంకతో లో స్కోరింగ్ మ్యాచులో అంతకన్నా ఎక్కువ మజా వచ్చిందని క్రికెట్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే భారత్ 213 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇండియా ఈ మ్యాచును ఫిక్స్ చేసిందని పాక్ అభిమానులు ఆరోపణలు చేశారు.
పాకిస్తాన్‌ను ఇంటికి పంపడానికి కావాలనే భారత్ ఓడిపోతుందంటూ ఆరోపణలు చేస్తూ పాకిస్తాన్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్‌కి కొంత మంది అభిమానులు ఫోన్లు చేశారంటా. నిన్న ఆసియా కప్ సూపర్-4లో శ్రీలంకతో జరిగిన మ్యాచులో భారత్ 213కి ఆలౌట్ కావడంతో శ్రీలంక గెలుస్తుందని అంతా భావించారు. మొదటి ఇన్నింగ్స్ పూర్తి కాగానే పాక్ అభిమానులు ఇండియా మ్యాచ్ ఫిక్స్ చేసిందని ఆరోపణలు గుప్పించారు. అయితే దీనికి షోయబ్ అక్తర్ స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చారు. “విజయం సాధిస్తే తప్పకుండా ఫైనల్ చేరుతామని భారత్‌కు తెలుసు అలాంటప్పుడు ఎందుకు ఓడిపోవాలని అనుకుంటుంది”అని ప్రశ్నించాడు అక్తర్.
20 ఏళ్ల పిల్లవాడు వెల్లలాగే 5 వికెట్లు తీశాడని, అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. అలాగే, 4 వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించిన కుల్దీప్ యాదవ్‌పై కూడా ఈ పాకిస్థాన్ మాజీ బౌలర్ ప్రశంసలు కురిపించాడు.