బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో గెలిచి సిరీస్ లో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ వచ్చింది. పెర్త్ వేదికగా జరిగే ఈ తొలి టెస్టుకు అంపైర్‌లను ఐసీసీ ప్రకటించింది. రిచర్డ్ కెటిల్‌బరో, క్రిస్ గాఫ్నీలు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ థర్డ్ అంపైర్‌గా, సామ్ నోగాజ్‌స్కీ నాలుగో అంపైర్‌గా, రంజన్ మదుగల్లె మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే ఈ జాబితాలో రిచర్డ్ కెటిల్‌బరో ఉండడంతో భారత అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. గతంలో భారత్ ఓడిపోయిన ప్రతీ కీలక మ్యాచ్‌లోనూ రిచర్డ్ కెటిల్‌బరోనే అంపైర్ గా ఉన్నాడు. ముఖ్యంగా అతడు అంపైర్‌గా ఉన్న ఒక్క ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ అతడిని ఐరెన్ లెగ్ అంపైర్‌గా పిలుస్తుంటారు.