Ishan Kishan: దారిలోకి వచ్చిన అయ్యర్, ఇషాన్ కిషన్.. దేశవాళీ క్రికెట్ బరిలో యువ క్రికెటర్లు

మార్చి 2 నుంచి తమిళనాడుతో ప్రారంభమయ్యే సెమీ ఫైనల్లో ముంబయి తరఫున బరిలోకి దిగేందుకు ఒప్పుకున్నాడు. కాగా రంజీల్లో ఆడకుండా ఉండేందుకు శ్రేయస్‌ అయ్యర్‌.. ముంబై క్రికెట్‌ ఆసోసియేషన్‌కు తప్పుడు సమాచారం అందించాడని ఎన్‌సీ‌ఏ రిపోర్ట్‌తో తేలిపోయింది.

  • Written By:
  • Publish Date - February 28, 2024 / 12:18 PM IST

Ishan Kishan: టీమిండియా యంగ్‌ బ్యాటర్లు శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్ కిషన్ ఎట్టకేలకు దారిలోకి వచ్చారు. రంజీ మ్యాచ్‌లు ఆడకుండా తప్పించుకుని తిరుగుతున్న వీరిద్దరూ బీసీసీఐ కాంట్రాక్ట్‌ రద్దు ప్రచారం నేపథ్యంలో దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగారు. సెంట్రల్‌ కాంట్రాక్టు కలిగిన ఆటగాళ్లు ఫిట్‌గా ఉండి, భారత్‌ తరఫున ఆడని సమయాల్లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడాలని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన వేళ రంజీల్లో ఆడేందుకు అయ్యర్ సిద్దమయ్యాడు.

Rs.500 Gas Cylinder : ముందు సిలెండర్ కు 955 కట్టాల్సిందే…. తర్వాత ఖాతాల్లోకి సబ్సిడీ !

మార్చి 2 నుంచి తమిళనాడుతో ప్రారంభమయ్యే సెమీ ఫైనల్లో ముంబయి తరఫున బరిలోకి దిగేందుకు ఒప్పుకున్నాడు. కాగా రంజీల్లో ఆడకుండా ఉండేందుకు శ్రేయస్‌ అయ్యర్‌.. ముంబై క్రికెట్‌ ఆసోసియేషన్‌కు తప్పుడు సమాచారం అందించాడని ఎన్‌సీ‌ఏ రిపోర్ట్‌తో తేలిపోయింది. దీంతో అయ్యర్‌ తప్పుడు నివేదిక ఇవ్వడంతో బీసీసీఐ సీరియస్‌ అయింది. ఈ నేపథ్యంలో రంజీ సెమీఫైనల్లో ఆడేందుకు అంగీకరించాడని తెలుస్తోంది.

ఇక శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు ఇషాన్‌ కిషన్‌ కూడా బీసీసీఐ ఆదేశాలను పట్టించుకోలేదు. అయితే విరామం తర్వాత ఇషాన్‌ కిషన్‌ మంగళవారం గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. డీవై పాటిల్‌ టీ20 కప్‌లో మ్యాచ్‌ ఆడాడు. దీని తర్వాత మార్చి 22 నుంచి జరగనున్న ఐపీఎల్‌-17వ సీజన్‌లో ఇషాన్‌ ఆడనున్నాడు.