Shubman Gill: వన్డే టాప్ ర్యాంకింగ్స్‌లోకి గిల్, ఇషాన్ కిషన్..

ఆసియా కప్‌ 2023లో నేపాల్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గిల్ అజేయంగా 67 పరుగులు చేసిన విషయం తెగెలిసిందే. వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అత్యధిక రేటింగ్ పాయింట్స్ ఇవే కావడం విశేషం. పల్లెకెలెలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

  • Written By:
  • Updated On - September 6, 2023 / 05:56 PM IST

Shubman Gill: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ కెరీర్ హై రేటింగ్‌కు చేరుకున్నారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గిల్ మూడో స్థానంలో ఉన్నాడు. భారత ఓపెనర్ ఖాతాలో 750 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆసియా కప్‌ 2023లో నేపాల్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గిల్ అజేయంగా 67 పరుగులు చేసిన విషయం తెగెలిసిందే. వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అత్యధిక రేటింగ్ పాయింట్స్ ఇవే కావడం విశేషం.

పల్లెకెలెలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో 624 రేటింగ్ పాయింట్లతో కెరీర్-బెస్ట్ మార్క్‌ అందుకున్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ జాబితాలో 12 స్థానాలు ఎగబాకిన ఇషాన్.. 24వ స్థానానికి చేరుకున్నాడు. ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 882 పాయింట్లతో నం.1 ర్యాంక్ నిలబెట్టుకున్నాడు. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 777 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో ఉన్నాడు.