ప్రపంచ కప్ సచిన్ కల. ఆ కల కోసం ఆరు వరల్డ్ కప్‌లు ఆడాడు. 2007 ప్రపంచ కప్ మినహా ప్రతిసారీ ప్రాణం పెట్టి పరుగులు చేశాడు.. 2011లో తన కలను సాకరం చేసుకున్నాడు.. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న సచిన్..తన కెరీర్ ప్రారంభం నుంచి చివరి వరకు ప్రపంచ్ కప్ గురించే ఎక్కువగా మాట్లాడేవాడు..! 1983లో కపిల్‌దేవ్ సారధ్యంలో టీమిండియా మొదటిసారి ప్రపంచ కప్ గెలుచుకుంది. అప్పటివరకు ముంబై వీధుల్లో క్రికెట్ బ్యాట్ పట్టుకొని తిరిగిన సచిన్.. ఆ ప్రపంచ కప్ స్ఫూర్తితో గేమ్‌ను చాలా సిరీయస్‌గా తీసుకున్నాడు. కొచ్ రామ్‌కాంత్ అచ్రెకర్ టీచింగ్‌లో రాటుదేలాడు.. ఎప్పటికైనా టీమిండియా ప్రపంచ్ కప్ గెలిచిన జట్టులో ఉండాలని.. అదే తన కల అని సచిన్ చెప్పుకున్న సందర్భాలకు లెక్కలేదు.
కట్ చేస్తే.. 28సుదీర్ఘ విరామం తర్వాత భారత్ కప్ గెలిచింది. ఆ సమయంలో ఓ 12ఏళ్ల పిల్లోడు అచ్చం సచిన్ మురిసిపోయినట్లే మురిసిపోయాడు..ధోనీ సిక్సర్ కొట్టిన మరుక్షణం ఎగిరి గంతేశాడు.. సచిన్‌ను తోటి క్రికెటర్లు భూజాలపై మోస్తుంటే తాను కూడా ఏదో ఒక రోజు ఆ స్థాయికి వెళ్లాలని బలంగా డిసైడ్ అయ్యాడు. ఎంతో కష్టపడ్డాడు.. తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు.. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.. మరో సచిన్, కోహ్లీ అంటూ ఫ్యాన్స్ చేత పిలుపించుకుంటున్నాడు..!
శుభ్‌మన్‌గిల్.. ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో మారు మోగుతున్న పేరు.. ఐపీఎల్‌లో బెంగళూరు, ముంబై జట్లను ఇంటికి పంపిన వీరుడు.. ఓ మ్యాచ్‌లో క్లాస్ హిట్టింగ్.. మరో మ్యాచ్‌లో మాస్ హిట్టింగ్..ఇలా వరుసపెట్టి విధ్వంసం సృష్టించడం ఈ మధ్య కాలంలో గిల్‌కే చెల్లింది. అందుకే ఫ్యాన్స్ గిల్‌ని మరో సచిన్.. మరో కోహ్లీ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. యువ ఆటగాళ్లపై ఎక్కువగా ప్రశంసలు కురిపిస్తూ ప్రొత్సహించే సచిన్..ఈసారి ఓ అడుగు ముందుకేసి మరి గిల్‌ని పొగిడాడు.. ఏకంగా ఓ ట్వీట్‌లో మూడుసార్లు గిల్ బ్యాటింగ్‌ను మెచ్చుకున్నాడు.. ముంబైపై గిల్ సెంచరీ తర్వాత డగౌట్‌లోనే గిల్‌ని పిలిచి మరీ మాట్లాడాడు. సచిన్ ఈ విధంగా హైప్ ఇచ్చిన క్రికెటర్లు చాలా అరుదు.. అప్పట్లో కోహ్లీ, రోహిత్ శర్మలకు మాత్రమే సచిన్ ఈ విధంగా పొగిడేవాడు.. ఇన్నాళ్లకు మళ్లీ గిల్..!
నిజంగానే గిల్ సచిన్, కోహ్లీ అంత పెద్ద ప్లేయర్ అవుతాడా అంటే ఏమో ఇప్పటికైతే చెప్పలేం కానీ.. రన్స్ చేయడానికి గిల్ ఆకలిగున్న సింహం లాగా పరుగులు తీస్తున్నాడు.. ఎక్కడా ఎకాగ్రత కోల్పోవడం లేదు.! అయితే కేవలం ఐపీఎల్ ఆధారంగానే గిల్ ఆటపై అంచనాకు రాలేం..! క్రికెట్‌లో అన్నిటికంటే అత్యుత్తమైన ఫార్మెట్ టెస్టు క్రికెట్. అది ఆడితేనే క్రికెటర్ టాలెంట్ తెలుస్తుంది.. గిల్ టెస్టుల్లో రాణించాలి.. అది కూడా విదేశీ గడ్డపై చెలరేగాలి.. కొన్ని రోజుల్లో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఉంది..అందులో గిల్ సెంచరీ చేసి టీమిండియాను గెలిపిస్తే ఇక కోహ్లీ రిటైర్‌మెంట్ తర్వాత మనకు ఏ బెంగా లేనట్లే లెక్కా.. అయితే తనను సచిన్, కోహ్లీతో కంపేర్ చేయడాన్ని గిల్ ఒప్పుకోవడంలేదు.. వాళ్లే తన స్పూర్తి అని.. 1983 ప్రపంచ కప్ సచిన్‌లో ఎలా అయితే స్ఫూర్తి నింపిందో..తనను 2011ప్రపంచ కప్ అలానే స్ఫూర్తి నింపిందని చెబుతున్నాడు.మరి చూడాలి గిల్ కెరీర్ సచిన్, కోహ్లీ లాగా సాగుతుందో..లేక లేనిపోని కాంట్రవర్శీలతో వినోద్ కాంబ్లీలా ఎండ్ అవుతుందో కాలమే నిర్ణయిస్తుంది.