Shubman Gill: టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆట తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కఠినమైన పిచ్‌లపై ఆడే సత్తా అతడికి లేదంటూ ట్రోల్ చేస్తున్నారు. ఫామ్‌ను బట్టే తుదిజట్టు ఎంపిక ఉండాలని.. అప్పుడే అనుకున్న ఫలితాలు రాబట్టగలరంటూ మేనేజ్‌మెంట్‌కు చురకలు అంటిస్తున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత శుబ్‌మన్ గిల్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై.. తొలిసారిగా ప్రపంచకప్ ఈవెంట్లో ఆడిన ఈ పంజాబీ బ్యాటర్.. తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 350 పరుగులు సాధించాడు.
Parliament attack: పార్లమెంటుపై దాడి.. నలుగురు అరెస్టు.. నిందితుల గుర్తింపు
అయితే, ఆస్ట్రేలియాతో కీలక ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. తనకు అచ్చొచ్చిన నరేంద్ర మోదీ స్టేడియంలో కేవలం నాలుగు పరుగులకే అవుటై విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ట్రోలింగ్ బారిన పడ్డ గిల్.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ సందర్భంగా విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పర్యటనతో పునరాగమనం చేసిన శుబ్‌మన్ గిల్.. రెండో టీ20లో దారుణంగా విఫలమయ్యాడు. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా దక్షిణాఫ్రికాతో మంగళవారం నాటి మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ప్రొటిస్ పేసర్ లిజాడ్ విలియమ్స్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. మరో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కూడా సున్నా స్కోరుకే పెవిలియన్ చేరాడు.
అయితే, ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం కలిగించింది. ఈ నేపథ్యంలో అద్బుతంగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్‌తో సిరీస్‌లో అదరగొట్టిన మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కాదని శుబ్‌మన్ గిల్‌కు ఛాన్స్ ఇచ్చినందుకు మూల్యం చెల్లించాల్సి వచ్చిందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. టాప్ స్కోరర్‌గా నిలిచి.. మంచి ఫామ్‌లో ఉన్న రుతును పక్కనపెట్టడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.