Shubman Gill: ఇలా ఔటయ్యారెంటి..? ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్

చివరి వన్డేలో మంచి ఫామ్ కనబరిచిన శుభ్‌మన్ గిల్ కేవలం 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడేందుకు ప్రయత్నించిన గిల్.. భారీ షాట్లకు వెళ్లలేదు. ఈ క్రమంలో 8 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు.

  • Written By:
  • Publish Date - August 4, 2023 / 03:57 PM IST

Shubman Gill: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టుకు అనుకున్న ఆరంభం లభించలేదు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ అనుకున్న స్కోరు చేయలేకపోయింది. భారత బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఆ టీంలో ఉన్న ఎవర్నీ భారీ షాట్లు పెద్దగా ఆడనివ్వలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ కేవలం 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓ మోస్తరు లక్ష్య ఛేదనను భారత జట్టు ఈజీగా పూర్తి చేస్తుందని ఫ్యాన్స్ అనుకున్నారు.

కానీ టీమిండియాకు కూడా అనుకున్న ఆరంభం లభించలేదు. చివరి వన్డేలో మంచి ఫామ్ కనబరిచిన శుభ్‌మన్ గిల్ కేవలం 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడేందుకు ప్రయత్నించిన గిల్.. భారీ షాట్లకు వెళ్లలేదు. ఈ క్రమంలో 8 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఒత్తిడికి గురైన అతను.. స్టంపింగ్ రూపంలో వెనుతిరిగాడు. దీంతో భారత ఫ్యాన్స్ షాకయ్యారు. అయితే ఈ టూర్ మొత్తం మంచి ఫామ్ కనబరిచిన ఇషాన్ కిషన్ క్రీజులోనే ఉండటంతో పెద్దగా టెన్షన్ పడలేదు. కిషన్ కూడా భారీ షాట్లు ఆడకుండానే ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. అప్పటికే 8 బంతులు ఆడిన అతను కేవలం 6 పరుగులే చేశాడు.

దీంతో ఒత్తిడికి గురైన కిషన్.. కెప్టెన్ రావ్‌మెన్ పావెల్ క్యాచ్ పట్టేయడంతో నిరాశగా మైదానం వీడాల్సి వచ్చింది. వీళ్లిద్దరూ అవుటవడం కన్నా కూడా.. అవుటైన విధానంపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.