Shubman Gill: ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలం నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వీడటంతో ఆ ఫ్రాంచైజీ తమ నూతన సారథి పేరును ప్రకటించింది. అందరూ ఊహించనట్లుగానే స్టార్ ఓపెనర్, ప్రిన్స్ శుభ్‌మన్ గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. జట్టును అద్భుతంగా నడిపి టైటిల్ అందించడంతో పాటు గత సీజన్‌లో రన్నరప్‌గా నిలబెట్టిన హార్దిక్ పాండ్యాకు వీడ్కోలు చెబుతూ ధన్యవాదాలు తెలిపింది. అతని భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించింది. ఈ మేరకు తమ సోషల్ మీడియా ఖాతాల్లో వరుస పోస్ట్‌లు చేసింది.
Rinku Singh: రింకూ సింగ్.. మరో ధోనీ అవుతాడా..?
‘అప్‌కమింగ్ సీజన్‌లో టైటాన్స్‌ను నడిపించేందుకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అస్త్రశస్త్రాలతో రెడీగా ఉన్నాడు. అతని కొత్త ఇన్నింగ్స్‌కు విషెస్ తెలియజేయండి’అనే క్యాప్షన్‌తో శుభ్‌మన్ గిల్ ఫొటోను గుజరాత్ టైటాన్స్ ట్వీట్ చేసింది. ఈ ఫొటోపై శుభ్ శూరత్ అనే టైటిల్ పెట్టడంతో పాటు బ్యాక్ గ్రౌండ్‌లో శుభ్‌మన్ గిల్ ఘనతలకు సంబంధించిన పిక్స్‌ను ఎడిట్ చేసింది. అంతేకాకుండా రిటైన్ చేసుకున్న జట్టు వివరాలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ముందుగా గుజరాత్ టైటాన్స్ ప్రకటించిన రిటైన్ లిస్ట్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేరు ఉంది. ఆ తర్వాత రెండు గంటల్లోనే హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ చేసుకున్నామని ముంబై ఇండియన్స్ ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. ట్రేడింగ్ విండోకు డిసెంబర్ 12 వరకు గడువు ఇవ్వడంతో ఈ డీల్ జరిగినట్లు తెలుస్తోంది.
ముందుగా రూ.17.50 కోట్ల ఆటగాడైన కామెరూన్ గ్రీన్‌ను ఆర్‌సీబీలోకి ట్రేడ్ చేసిన ముంబై.. ఆ డబ్బులో నుంచి రూ. 15 కోట్లను గుజరాత్ టైటాన్స్‌కు చెల్లించి హార్దిక్ పాండ్యాను తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ రిలీజ్ ఆటగాళ్ల లిస్ట్ లో, హార్దిక్ పాండ్యా, యశ్ దయాల్, కేఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ప్రదీప్ సంగ్వాన్, ఒడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, డసన్ షనకలు ఉన్నారు.