ఐపీఎల్ పిచ్‌లు ఎంతో టాలెంట్ ఉన్నవాళ్లని కూడా అనామక బ్యాటర్లగా మార్చేస్తాయి. బౌలర్లుకు జీవం లేని పిచ్‌లపై చెలరేగిపోతూ.. విదేశీ గడ్డపై ఘోరంగా ఫెయిల్ అయ్యే ఆటగాళ్ల జాబిత పెద్దదే. ఈ లిస్టులో టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ కూడా చేరిపోనున్నాడా అంటే కొంతమంది క్రికెట్ లవర్స్ అవుననే అంటున్నారు. విండీస్ గడ్డపై గిల్ ఆట అధ్వానంగా ఉంది. ముఖ్యంగా అహ్మదాబాద్ బయట గిల్ స్టాట్స్ ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంకెలతో సహా ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో ఒక్క మ్యాచ్‌లోనే 126 పరుగులు చేసిన గిల్.. ఆ తర్వాత బయట ఆడిన వెన్యూస్‌లో 8 మ్యాచ్‌లు కలిపి 92పరుగులే చేశాడు. అయితే ఇదంతా రిసెంట్ స్టాట్స్ మాత్రమే. అంతమకుందు గిల్ రికార్డులు అహ్మదాబాద్ బయట కూడా అద్భుతంగా ఉన్నాయి. గుజరాత్‌లో కాకుండా ఇతర గడ్డలపై కూడా 60సగటు కలిగి ఉన్నాడు. కానీ ఇటివల మాత్రం ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు.
ఇక వరుస పెట్టి టీ20ల్లో మూడు సింగిల్ డిజిట్స్ చేసిన భారత్ ఆటగాళ్ల జాబితాలో చేరిన గిల్ మరో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. గత మూడు టీ20ల్లో గిల్ వరుసగా 3,7,6 పరుగులే చేశాడు. గతంలో సెహ్వాగ్, మురళి విజయ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ పేరిట ఈ చెత్త రికార్డు ఉండగా.. ఈ లిస్టులోకి గిల్ కూడా వచ్చి చేరాడు. నిజానికి వీరంతా ఫెయిల్ అయిన ప్రతిసారీ అప్పటి కెప్టెన్లు అండగా నిలుస్తూ వచ్చారు. విజయ్‌కి అండగా ధోనీ, రాహుల్‌కి అండగా కోహ్లీ, ఇషాన్‌కి అండగా రోహిత్ నిలుస్తూ వచ్చారు. ఇప్పుడు గిల్ కోసం పాండ్యా మిగిలిన ఆటగాళ్లని బలి చేస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నిజానికి గిల్ టెక్నిక్ పరంగా.. నిలకడ పరంగా గొప్ప ఆటగాడే. అతను ఆడే షాట్స్ చాలా కచ్చితత్వంతో ఉంటాయి. అందుకే దిగ్గజాలు సైతం అతని ఆటని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అయితే ఐపీఎల్‌లో ఎక్కువగా హోం పిచ్‌లపైనే మ్యాచ్‌లు జరుగుతాయి.. గిల్ ఎక్కువగా అహ్మదాబాద్ పిచ్‌పైనే బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ వెళ్లాడు.. ఇప్పుడు వెస్టిండీస్‌లో ఆడుతున్నాడు. అతని అనుభవం చాలా తక్కువే. ఇలా డిఫెరెంట్ పిచ్‌లపై అంతర్జాతీయ స్థాయిలో ఆడడం వేరు.. ఒకటే తరహా పిచ్‌లపై వివిధ వేదికల్లో ఐపీఎల్ ఆడడం వేరు. గిల్ ఈ విషయాన్ని త్వరగా అర్థం చేసుకుంటే మంచిది. లేకపోతే ఫ్లాట్ ట్రాక్ బుల్లి అన్న అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఆ ట్యాగ్ ఒకసారి తగిలిందంటే తర్వాత ఎంత కష్టపడి ఆడినా పోదు. ఇండియన్ ఫ్యాన్స్ మెంటాలిటీ అలాంటిది..!