Shubman Gill: టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం టీమిండియాను ఈ నెలాఖరులోపు ఎంపిక చేయనున్నారు. ఐపీఎల్‌లో అదరగొడుతున్న పలువురు యువ, సీనియర్ ప్లేయర్స్‌ను కూడా సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ఐపీఎల్ సీజన్‌లో దాదాపుగా 900 పరుగులు చేసిన తనకు జట్టులో చోటు దక్కకపోతే చేసేదేమీ లేదన్నాడు.
DANAM NAGENDER: కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్.. దానం నామినేషన్‌ను ఈసీ రద్దు చేస్తుందా?
ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఐపీఎల్ మీదనే ఉందని.. గుజరాత్ టైటాన్స్‌ను ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశం గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని చెప్పాడు. ఒకవేళ ఐసీసీ టోర్నీ ఆడే భారత జట్టులో తనకు చోటు దక్కకున్నా.. సహచర ఆటగాళ్లను చీర్ చేస్తూ వాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్తానని గిల్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ 17వ సీజన్ కు ముందే.. టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యా జట్టును వీడాడు. దీంతో టైటాన్స్ కెప్టెన్‌గా గిల్ బాధ్యతలు అందుకు న్నాడు. అయితే వ్యక్తిగతంగా ఈ సారి శుబ్‌మన్ గిల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. 9 ఇన్నింగ్స్‌లో కలిపి 304 పరుగులు చేశాడు.
అయితే మెగా టోర్నీలో టీమిండియా ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి బరిలోకి దిగుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లి ఆర్సీబీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతూ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్‌లో కలిపి 430 పరుగులతో ప్రస్తుతం టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.