Mohammed Shami: షమీ నెత్తిపై చేయి ఎందుకు పెట్టాడంటే.. గిల్ చెప్పిన సీక్రెట్ ఇదే..!

శ్రీలంక మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన తర్వాత షమీ నెత్తి మీద చేయి పెట్టి చూపించాడు. దీనికి చాలామంది ఆశ్చర్యపోయారు. దాని అర్థం ఏంటో తెలియక కన్‌ఫ్యూజ్ అయ్యారు. షమీ ఎందుకిలా అన్నాడనే చర్చ ఫ్యాన్స్‌లో సాగింది. అయితే ఈ రహస్యాన్ని బయటపెట్టాడు క్రికెటర్ శుభ్‌మన్ గిల్.

  • Written By:
  • Updated On - November 3, 2023 / 06:36 PM IST

Mohammed Shami: ICC వరల్డ్ కప్‌లో శ్రీలంక (srilanka)తో జరిగిన మ్యాచ్‌‌లో చెలరేగాడు మహ్మద్ షమీ (Mohammed Shami). 5 వికెట్లు తీసి భారత క్రికెట్ ఫ్యాన్స్‌కి కొన్ని రోజుల దాకా మర్చిపోలేని అనుభూతిని ఇచ్చాడు. ICC ప్రపంచ కప్ (world cup) చరిత్రలో 14 మ్యాచుల్లో 45 వికెట్లు తీసిన మొదటి భారతీయుడి ఘనత షమీకే దక్కింది. అయితే శ్రీలంక మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన తర్వాత షమీ నెత్తి మీద చేయి పెట్టి చూపించాడు. దీనికి చాలామంది ఆశ్చర్యపోయారు. దాని అర్థం ఏంటో తెలియక కన్‌ఫ్యూజ్ అయ్యారు.

Pawan Kalyan – Ram Charan : పిక్ ఆఫ్ ది డే.. రెండు కళ్లు సరిపోవడం లేదు.. ఇది కాదా కావాల్సి

షమీ ఎందుకిలా అన్నాడనే చర్చ ఫ్యాన్స్‌లో సాగింది. అయితే ఈ రహస్యాన్ని బయటపెట్టాడు క్రికెటర్ శుభ్‌మన్ గిల్. షమీ అలా నెత్తి మీద చేతులు పెట్టింది పారస్ మాంబ్రే (PARAS MHAMBREY)ని ఉద్దేశించి. అతను ఇప్పుడు టీమిండియా బౌలింగ్ కోచ్. షమీ కష్టాల్లో ఉన్నప్పుడు తనకు అన్ని రకాలుగా అండగా నిలిచాడు. తిరిగి గాడిలో పడేందుకు మాంబ్రే సహకరించాడని.. అందుకు కృతజ్ఞతగా ఈ ఐదు వికెట్ల ఘనతను షమీ.. మాంబ్రేకి అంకితం ఇచ్చాడట. మాంబ్రే నెత్తి మీద వెంట్రుకలు లేవు. అందుకే అలా నెత్తిన చెయ్యిపెట్టి చూపించాడు షమీ. ప్రస్తుతం టీమిండియా ఫాస్ట్ బౌలర్ల త్రయం చెలరేగిపోవడం వెనుక ఈ పారస్ మాంబ్రే ఉన్నాడు. అతని కెరీర్ గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. మనిషి ఏ దశలోనైనా రాణించే అవకాశం ఉంటుందని మాంబ్రే జీవితాన్ని చూస్తే అర్థం అవుతుంది. మాంబ్రే టీమిండియాలో ప్రధానమైన బౌలర్‌గా 1996 ఇంగ్లాండ్ సిరీస్‌కి ఎంపికయ్యాడు. స్వింగ్‌కి బాగా సహకరించే ఇంగ్లీష్ పిచ్‌లపై అతను రాణిస్తాడని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశించింది.

Panakala Narasimha Swamy: మహిమాన్విత పానకాల శ్రీలక్ష్మీ నరసింహస్వామి విశేషాలు..

స్వింగ్ బాగా రాబట్టగల బౌలర్‌గా మాంబ్రేకి గుర్తింపు కూడా ఉంది. కానీ తీరా సిరీస్‌లో అతడు ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత కూడా అడపాదడపా చాన్స్ వచ్చినా నిలబెట్టుకోలేక బౌలర్‌గా ఫేడవుట్ అయ్యాడు. 2021 నవంబర్‌లో పారస్ మాంబ్రే ఇండియన్ క్రికెట్ కోచింగ్ స్టాఫ్‌లో జాయిన్ అయ్యాడు. రాహుల్ ద్రవిడ్‌ని రిక్రూట్ చేసినప్పుడే ఇతన్ని కూడా బౌలింగ్ కోచ్‌గా అపాయింట్ చేసింది BCCI. మాంబ్రే మొత్తమ్మీద రెండు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. అయినా ఈ వాల్డ్ కప్‌లో ఇండియన్ బౌలర్లు చెలరేగి పోతున్నారంటే అందుక్కారణం పారస్ మాంబ్రేనే. ఆయన్ని గుర్తు చేసుకుంటూ షమీ నెత్తిమీద చేతులు పెట్టుకున్నాడు. శుభమన్ గిల్ ఈ సీక్రెట్ చెప్పేదాకా ఫ్యాన్స్‌కి సస్పెన్స్‌గానే మిగిలింది.