Smriti Manthana: కుమార సంగక్కర నా ఫెవరైట్.. అర్జిత్ సింగ్ కి పెద్ద ఫ్యాన్.. నాన్న సపోర్ట్ గొప్పది స్మృతి మంథాన

స్మృతి మంథాన గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేక పరియం అవసరం లేదు. భారత మహిళా క్రికెట్ విభాగంలో పెను సంచలనం ఆమె. ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది స్మృతి మంథాన.

  • Written By:
  • Publish Date - July 18, 2023 / 02:29 PM IST

క్రికెట్ ఫీల్డ్‌లో అగ్రెసీవ్‌గా బ్యాటింగ్ చేసే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ ఉమెన్ 18 జూలై 1996న ముంబైలో జన్మించింది. 2014లో ఇంగ్లాండ్‌లోని వార్మ్‌స్లీ పార్క్‌లో జరిగిన వన్డే మ్యాచులో తెరంగేట్రం చేసింది. స్మృతి కుటుంబానికి క్రికెట్‌కు విడదీయరాని బంధం ఉంది. సాంగ్లిలో జిల్లాస్థాయి క్రికెట్ పోటీల్లో మంథాన తండ్రి, సోదరుడు ఇద్దరూ క్రికెట్ ఆడారు. ఆమె సోదరుడు మహారాష్ట్ర అండర్ 16లో కూడా ఆడాడు. తొమ్మిది సంవత్సరాల వయసులోనే స్మృతి మంథాన మహారాష్ట్ర అండర్15 టీమ్‌కు సెలెక్ట్ అయింది. 11 ఏళ్లకు అండర్ 19కు ఆడి తన సత్తా చాటింది. 2013లో జరిగిన వన్డే మ్యాచులో స్మృతి మంథాన తొలి డబుల్ సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. 2014లో జరిగిన వరల్డ్ టీ20 కప్ కోసం స్మృతి మంథాన తన 12వ తరగతి పరీక్షలకు దూరం అయింది.

ఇంగ్లాండ్ టూర్ ఉండటంతో వేరే కాలేజీలో అడ్మిషన్ కూడా తీసుకోలేకపోయింది. క్రికెట్ ఫీల్డ్‌లో సీరియస్‌గా ఉండే స్మృతి మంథాన బయట మాత్రం చాలా సరదాగా ఉంటుంది. ఆమెకు అరిజిత్ సింగ్ పాటలు అంటే ఇష్టమట. మంథానాకు మాథ్యూ హేడెన్‌ లా బ్యాటింగ్ చేయడం అంటే ఇష్టమట. కానీ తన ఆటతీరు మాత్రం శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర లా ఉంటుంది. ఎందుకంటే సంగక్కర బ్యాటింగ్ టైమింగ్ ఆమెకు నచ్చుతుందట. ఆమె బ్యాటింగ్ శైలిని మాథ్యూ హేడెన్ మెచ్చుకోవడం కొసమెరుపు. స్మృతి మంథాన కోసం ప్రత్యేక కార్యచరణను తయారు చేయడంలో ఆమె కుటుంబం మొత్తం సహకరిస్తుంది. ఆమె తండ్రి ఆమె కోసం ప్రత్యేక ప్రోగ్రామ్ సిద్ధం చేస్తాడు. ఇందులో ఆహారం , ప్రాక్టిస్ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు.

2016లో ఐసీసీ మహిళా క్రికెట్ టీమ్‌లో చోటు సంపాదించిన తొలి భారతీయ మహిళ క్రికెటర్ స్మృతి మంథాన. 2017లో మహిళ ప్రపంచ కప్‌లో సెంచరీ సాధించి.. పిన్నవయసులోనే వరల్డ్ కప్‌లో సెంచురీ సాధించిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో 103 పరుగులు చేసింది. అంతేకాకుండా ఉమెన్స్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో తొలి శతకం సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా అవతరించింది. ఓపెనర్‌గా ఆటతో అదరగొట్టే భారత క్రికెటర్‌ స్మృతి మంధాన.. మహిళల ప్రిమియర్‌ లీగ్‌ వేలంలోనూ సత్తాచాటింది. మొట్టమొదటి డబ్ల్యూపీఎల్‌ వేలంలో అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ఆమె కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఏకంగా రూ.3.4 కోట్లు వెచ్చించింది. . కనీస ధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చిన ఆమెను.. ముంబయి ఇండియన్స్‌ను వెనక్కినెట్టి మరీ బెంగళూరు దక్కించుకుంది. ఆటతోను, అందంతోను మందనకు సోషల్ మీడియాలో హ్యుజ్ ఫాలోయింగ్ ఉంది.