Virat Kohili: టెస్ట్ మ్యాచ్ లో సచిన్ రికార్డ్ అధిగమించిన కోహ్లీ..

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న అతను.. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు.

  • Written By:
  • Publish Date - July 22, 2023 / 07:30 PM IST

క్రీజులో ఉన్నంతసేపూ మంచి పట్టుదలగా కనిపించిన అతను రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది కోహ్లీ కెరీర్‌లో 29వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఇప్పటివరకు 500 మ్యాచ్‌ల్లోనే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడి రికార్డ్‌ని సచిన్ 75 శతకాలతో కలిగి ఉన్నాడు. కానీ తన 500వ మ్యాచ్‌లోనే 76 సెంచరీ చేసిన కోహ్లీ ఇప్పుడు ఆ రికార్డ్‌ను తన సొంతం చేసుకున్నాడు.

కెరీర్ 500 అంతర్జాతీయ మ్యాచ్ నాటికి అత్యధిక సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(68) సెంచురీలు చేసి ఉన్నాడు.అలాగే ఈ లిస్టులో దక్షిణాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కల్లీస్ 60 సెంచరీలతో నాల్గో స్థానంలో ఉన్నాడు. ఇంకా 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ చరిత్రలో నిలిచాడు. అంటే ఇప్పటివరకు 5 వందలకు పైగా మ్యాచ్‌లు ఆడిన ఏ క్రికెటర్ కూడా తమ 500వ మ్యాచ్‌లో సెంచరీ చేయలేదు. 121 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్విక్ సింగిల్ తీయబోయి రనౌట్ అయ్యాడు.

కోహ్లీ కెరీర్‌లో టెస్టుల్లో ఇలా రనౌట్ అవడం ఇది కేవలం మూడోసారి మాత్రమే కావడం గమనార్హం. ఆ తర్వాత కాసేపటికే జడేజా (61) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (56) పరుగులతో మరోసారి బ్యాటుతో మెరిశాడు. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ 76వ శతకం సాధించిన సందర్భంగా అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ప్రత్యేక పోస్టు పెట్టింది. విరాట్ సెంచరీ తర్వాత అభివాదం చేస్తున్న సమయంలో తీసిన ఫొటోపై లవ్‌ సింబల్‌ ఉంచి షేర్ చేసింది.