World Cup 2023: మ్యాచ్ మధ్యలో కండరాల నొప్పి.. అంతా యాక్టింగ్ అన్న ఆటగాడు..!

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ చేసిన ఓవరాక్షన్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతడు నిజంగా నొప్పితో బాధ పడుతున్నాడా..? లేక నటిస్తున్నాడా..? అనే విషయం తెలియక తికమక పడ్డారు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 344 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించింది.

  • Written By:
  • Updated On - October 11, 2023 / 08:34 PM IST

World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ వేదికగా శ్రీలంకతో జరిగిన పోరులో పాకిస్తాన్ అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ చేసిన ఓవరాక్షన్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతడు నిజంగా నొప్పితో బాధ పడుతున్నాడా..? లేక నటిస్తున్నాడా..? అనే విషయం తెలియక తికమక పడ్డారు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 344 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించింది.

కుశాల్ మెండిస్, సదీర సమర విక్రమలు అద్భుత సెంచరీలకు తోడు పథుమ్ నిస్సాంక హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. ఆశలు పెట్టుకున్న బాబర్ ఆజమ్ కూడా తుస్సుమనిపించాడు. తర్వాత మొహమ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్‌లు జట్టును ఆదుకున్నారు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా రిజ్వాన్ చేసిన అతి మామూలుగా లేదు. తొడ కండరాలు పట్టేశాయంటూ పదే పదే ఫిజియోలతో గ్రౌండ్‌లోనే మసాజ్ చేయించుకున్నాడు. అంతేకాకుండా పదే పదే తన కాలును బ్యాట్‌తో బాదుకుంటూ కనిపించాడు. జట్టును గెలిపించేందుకు నొప్పిని భరిస్తూ రిజ్వాన్ ఎంత కష్టపడుతున్నాడు అని టీవీలో మ్యాచ్ చూసిన చాలా మంది అనుకునే ఉంటారు.

అయితే మ్యాచ్ అనంతరం జరిగిన ఇంటర్వ్యూలో రిజ్వాన్‌ను గాయం గురించి అడగ్గా.. ఒక్కోసారి అది నిజంగా నొప్పే, కానీ ఎక్కువ సార్లు జస్ట్ యాక్టింగ్ అంటూ రిజ్వాన్ చెప్పాడు. దీంతో రిజ్వాన్ చేసింది యాక్టింగ్ అని తెలిసిన ఫ్యాన్స్.. మంచిగా ఆడుతున్నప్పుడు ఇలాంటి బిల్డప్‌లు ఎందుకు బాబాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.