Mohammed Siraj: ఆరేసిన సిరాజ్.. 55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్..

బుల్లెట్లలా దూసుకొచ్చిన సిరాజ్ బంతులను ఎదుర్కొనేందుకు సఫారీ బ్యాటర్లు విలవిలలాడిపోయారు. కనీసం డిఫెండ్ చేసేందుకు కూడా భయపడ్డారంటే సిరాజ్ బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్లతో సహా టాపార్డర్‌లో ముగ్గురినీ సింగిల్ డిజిట్‌కే ఔట్ చేశాడు.

  • Written By:
  • Publish Date - January 3, 2024 / 05:41 PM IST

Mohammed Siraj: సఫారీ గడ్డపై దెబ్బతిన్న పులిలో భారత్ రెచ్చిపోయింది. తొలి టెస్టులో నిరాశపరిచిన మన పేసర్లు రెండో టెస్టులో చెలరేగిపోయారు. ముఖ్యంగా హైదరాబాదీ పేసర్ సఫారీ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాను అసలు కుదురుకోనివ్వలేదు. బుల్లెట్లలా దూసుకొచ్చిన సిరాజ్ బంతులను ఎదుర్కొనేందుకు సఫారీ బ్యాటర్లు విలవిలలాడిపోయారు. కనీసం డిఫెండ్ చేసేందుకు కూడా భయపడ్డారంటే సిరాజ్ బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

RBI New Guidelines: బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అలాంటి ఖాతాలపై పెనాల్టీ బంద్..!

ఓపెనర్లతో సహా టాపార్డర్‌లో ముగ్గురినీ సింగిల్ డిజిట్‌కే ఔట్ చేశాడు. సిరాజ్ దెబ్బకు సౌతాఫ్రికా 34 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకుంది. సిరాజ్‌కు తోడుగా బుమ్రా, ముఖేశ్ కుమార్ కూడా సత్తా చాటడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 55 పరుగులకే ముగిసింది. సిరాజ్ కేవలం 9 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. నలుగురు బ్యాటర్లను సిరాజ్ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు పంపాడు. సిరాజ్ స్పెల్‌లో మూడు మెయిడెన్ ఓవర్లు ఉన్నాయి. అటు బూమ్రా 2, ముకేశ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. అశ్విన్ స్థానంలో జడేజా, శార్దూల్ ఠాకూర్ స్థానంలో ముకేశ్ కుమార్ జట్టులోకి వచ్చారు.

ముకేశ్ కుమార్ ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు సిరీస్‌ను కాపాడుకునే క్రమంలో బౌలర్లు మంచి ఆరంభాన్నే ఇవ్వగా.. ఇప్పుడు బ్యాటర్లు రాణించి భారీ ఆధిక్యం అందిస్తే భారత్ ఈ మ్యాచ్ లో పట్టుబిగించొచ్చు.