IPL 2023: వాళ్ల టాప్ స్పిన్నర్లతో.. వీళ్ళ తోప్ బ్యాట్స్ మెన్ ఫైట్..

ఐ పి ఎల్ 2023 కోసం మొదటిసారి చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో సి ఎస్ కె మీద రాయల్స్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే చెన్నై ఇప్పుడు ఏడు గేమ్‌లలో ఐదు విజయాలతో పాయింట్స్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

  • Written By:
  • Publish Date - April 27, 2023 / 04:30 PM IST

సీ ఎస్ కె కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరోసారి బలమైన బ్యాటింగ్ లైనప్‌ను ఆశిస్తున్నాడు, రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే మరియు అజింక్యా రహానే వంటి దిగ్గజాలు ఈ సీజన్‌లో సంచలన ఆటతీరును కొనసాగించారు. బౌలింగ్ విషయానికొస్తే రవీంద్ర జడేజా, మొయిన్ అలీలు కీలకంగా మారనున్నారు. హోస్ట్‌ టీమ్ లో ఇద్దరు టాప్-క్లాస్ స్పిన్నర్లయిన  అశ్విన్, యుజువేంద్ర చాహల్‌ లు మ్యాచ్ విన్నర్లుగా నిలిచే అవకాశముంది. లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. స్కోర్ బోర్డులో మాక్సిమం రన్స్ పెట్టాల్సిన బాధ్యత కెప్టెన్ సంజూ శాంసన్, జోస్ బట్లర్ మరియు షిమ్రాన్ హెట్మెయర్ లపై ఎక్కువగా ఉంది.

ఐపీఎల్ సీజన్‌లో రెండు జట్లూ పటిష్టంగా, నిలకడగా రాణిస్తున్నాయి. ఇరు జట్లు రెండు వందల పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్నాయి. ఇది ఆర్ఆర్ కి హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ మరోవైపు ఈ మైదానంలో లక్నో తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఓడిపోయింది. అలాగే రాజస్థాన్ ఈ సీజన్‌లో చెన్నై తో ఆడిన వారి మొదటి మ్యాచ్‌లో విజయం సాధించింది, 37వ ఐపీఎల్ మ్యాచ్‌లో విజయం సాధించిన పరిస్థితిలో ఎవరు ఉండగలరో ఊహించడం కష్టంగా ఉండడంతో ఈ గేమ్ కోసం ఐ పి ఎల్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.