శ్రేయాస్ ఇంకా అదే వీక్ నెస్ ఇలా అయితే చోటు కష్టమే

దేశవాళీ క్రికెట్ ఆడితేనే జాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకుంటామని కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే తేల్చేశాడు. సీనియర్లలో ముగ్గురికి ఈ విషయంలో మినహాయింపు ఇవ్వగా...

  • Written By:
  • Publish Date - August 31, 2024 / 09:55 PM IST

దేశవాళీ క్రికెట్ ఆడితేనే జాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకుంటామని కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే తేల్చేశాడు. సీనియర్లలో ముగ్గురికి ఈ విషయంలో మినహాయింపు ఇవ్వగా… మిగిలిన వారంతా ఖచ్చితంగా డొమెస్టిక్ టోర్నీలు ఆడాల్సిందే. ముఖ్యంగా గాయాలతో జట్టుకు దూరమైన పలువురు ఆటగాళ్ళకు దేశవాళీ టోర్నీలు మంచి అవకాశంగా చెప్పొచ్చు. అయితే ఈ అవకాశాలను శ్రేయాస్ అయ్యర్ వృథా చేసుకుంటున్నాడు. టెస్ట్ జట్టులో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న శ్రేయాస్ తాజాగా బుచ్చిబాబు టోర్నీలో నిరాశపరిచాడు. ముఖ్యంగా అతను ఔటైన తీరుపైనే చర్చ జరుగుతోంది. షార్ట్ పిచ్ బాల్స్ కు ఔటవడం శ్రేయాస్ బలహీనతగా ఉంది. ఇప్పటికీ దీనిని అధిగమించడంలో అయ్యర్ విఫలమవుతున్నాడు.

షార్ట్ పిచ్ బంతులకు వికెట్ సమర్పించుకునే వీక్ నెస్ ను శ్రేయాస్ అధిగమించలేకపోతున్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన చివరి మూడు టెస్టులకు శ్రేయస్‌ను జట్టు నుంచి తప్పించడానికి ఇదీ ఓ కారణం. తన టెక్నిక్ ను మార్చుకుంటే తప్ప ఈ వీక్ నెస్ నుంచి బయటపడడం కష్టం. తాజాగా బుచ్చిబాబు టోర్నీలో ఇలాంటి బంతులకే ఔటవడంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అసలే జట్టులో ప్లేస్ కోసం విపరీతమైన పోటీ నెలకొన్న వేళ శ్రేయాస్ తన వీక్ నెస్ నుంచి బయటపడకుంటే టెస్ట్ జట్టులో చోటు దక్కడం కష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.