ఈ సోకులే తగ్గించుకో.. సన్ గ్లాసెస్ తో వచ్చి డకౌట్

భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం... ప్రస్తుతం ఒక్కో ప్లేస్ కూ కనీసం ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 13, 2024 / 06:55 PM IST

భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం… ప్రస్తుతం ఒక్కో ప్లేస్ కూ కనీసం ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సెలక్టర్లను ఆకట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు మెరుగ్గా రాణించుకోవాల్సిందే.. వైఫల్యాల బాటలోనే ఉంటే జాతీయ జట్టులో చోటు కష్టమే…ప్రస్తుతం శ్రేయాస్ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం ఒక కారణమైతే… తన బిహేవియర్ తో విమర్శల పాలవువుతున్నాడు. ఆట కంటే సోకులకే ప్రయారిటీ ఇస్తూ ట్రోలింగ్ కు గురవుతున్నాడు. తాజాగా దులీప్ ట్రోఫీలో మరోసారి నిరాశపరిచాడు. అనంతపురం వేదికగా ఇండియా-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రేయాస్ డకౌటయ్యాడు.

అయితే శ్రేయస్‌పై నెట్టింట్లో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. సన్‌గ్లాసెస్‌తో హీరోలా వచ్చి జీరోకి ఔటయ్యాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా బ్యాటర్లు ‌సన్‌గ్లాసెస్ ధరించి బ్యాటింగ్‌ చేయడం చాలా అరుదు. శ్రేయస్ ఇలా గ్లాసెస్ పెట్టుకుని రావడం, డకౌటవడంతో ఫ్యాన్స్ ట్రోలింగ్ కు గురయ్యాడు. స్టైల్ పై దృష్టి తగ్గించి ఆటపై ఫోకస్ పెట్టాలంటూ ట్రోల్ చేస్తున్నారు. మిగిలిన బ్యాటర్లు ఆడగా లేనిది నీకేం అయిందంటూ అడుగుతున్నారు. అసలే సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయాస్ ఇలా ఆడితే జాతీయ జట్టులోకి రీఎంట్రీ కష్టమేనంటూ తేల్చేస్తున్నారు.