SRH VS MI: ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ చరిత్ర సృష్టించింది. సిక్సర్ల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో రికార్డుల మోత మోగింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 523 పరుగులు చేశాయి. టీ20 చరిత్రలోనే ఒక మ్యాచ్‌లో ఇన్ని పరుగులు నమోదవ్వడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 38 సిక్స్‌లు నమోదు చేశాయి.
Addanki Dayakar: కంటోన్మెంట్ రేసులో అద్దంకి ? ఏకగ్రీవం లేనట్టేనా ?
పురుషుల టీ20 క్రికెట్‌లో ఇది ఆల్‌టైమ్ రికార్డు. ఐపీఎల్ చరిత్రలోనూ అత్యధిక సిక్స్‌లు నమోదైన మ్యాచ్‌గా కూడా ఇది చరిత్రకెక్కింది. ఈ 38 సిక్స్‌లలో ముంబై ఇండియన్స్ 20 సిక్సర్లు నమోదు చేయగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 18 సిక్స్‌లు కొట్టింది. ఈ హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగుల భారీ స్కోర్ చేసింది. తద్వారా ఐపీఎల్ టోర్నీలో భారీ స్కోర్ నమోదు చేసింది.
2013లో ఆర్‌సీబీ నమోదు చేసిన 263/5 స్కోర్ ఇప్పటి వరకు అత్యధికంగా ఉండగా.. తాజా ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ అధిగమించింది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్‌లో నలుగురు హాఫ్ సెంచరీలు చేశారు. లక్ష్య చేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు చేసి ఓటమిపాలైంది.