Nitish Kumar Reddy: సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ నితీష్ కుమార్ రెడ్డి పెర్ఫార్మెన్స్‌ను ఎవరూ మర్చిపోలేరు. మెరుపు లాంటి బ్యాటింగ్‌తో మొత్తం ఫోకస్‌ను తనవైపు తిప్పుకున్నాడు నితీష్. 39 రన్స్ ఫర్ 3 వికెట్స్ ఉన్న మ్యాచ్ 182 రన్స్ ఫర్ 9 వికెట్స్‌కు వెళ్లడంతో కీ రోల్ ప్లే చేశాడు నితీష్. జస్ట్ 37 బాల్స్‌లో 64 రన్స్ కొట్టి బెస్ట్ స్టేడియంను షేక్ చేశాడు.నాలుగు ఫోర్లు 5 సిక్స్‌లు కొట్టి 172 స్ట్రైక్ రేట్ సాధించాడు.
RS Praveen Kumar: ఎన్నికల వేళ RS ప్రవీణ్‌కు భారీ షాక్..!
దీంతో నితీష్ పర్మాఫర్మెన్స్‌ను పొగుడుతూ ఫార్మర్ క్రికెటర్ హనుమ విహారి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. హైదరాబాద్ టీంకు నితీష్ దొరకడం ఓ అదృష్టమంటూ రాసుకొచ్చాడు. ఐతే ఇక్కడ విషయంలో నితీష్ బ్యాటింగో లేక హనుమ విహారి ట్వీటో కాదు. 2018లో నితీష్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఓ స్టోరీ. క్రికెటర్‌గా గొప్ప స్థాయికి వచ్చి తన తండ్రి కళ్లలో ఆనందం చూడటమే తన లక్ష్యమంటూ అప్పట్లో ఓ పోస్ట్ పెట్టాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇప్పుడు మనోడు చేసిన బ్యాటింగ్‌తో ఆ ప్రామిస్‌ను నిలబెట్టుకున్నాడంటూ పాత పోస్ట్‌ను వైరల్ చేస్తున్నారు నితీష్ ఫ్యాన్స్. నితీష్ కుమార్‌ది నార్మల్ మిడిల్ క్లాస్ కుటుంబం. నితీష్ తండ్రి పేరు మౌతల్య రెడ్డి. చాలా మంది కామన్ పీపుల్‌లాగా ఆయన తన కొడుకు గేమ్‌ను తక్కువగా చూడలేదు.
గేమ్ మానేసి ఉద్యగం చేయమని కూడా అడగలేదు. కొడుకు కెరియర్ కోసం తాను కూడా కష్టపడ్డాడు. తన కొడుకు టోర్నీలకు తీసుకువెళ్లేందుకు మంచి ప్రాక్టీస్ కోసం వేరే ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని చేసే ఉద్యోగం కూడా మానేసి కొడుకును ట్రైన్ చేయించాడు. ఆ కష్ట ఫలితమే ఇప్పుడు స్టేడియంలో రన్స్ మెషీన్‌గా మారింది. దీంతో తండ్రికి ఇచ్చిన మాటను నితీష్ నిలబెట్టుకున్నాడు అంటూ ఆ పాత పోస్ట్‌ను వైరల్ చేస్తున్నారు నితీష్ ఫ్యాన్స్.