BAN vs SL: ఇలాగే ఆడితే నేపాల్ కూడా ఓడిస్తుంది.. బంగ్లాపై ఫ్యాన్స్ కామెంట్..!

పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. డ్రై పిచ్‌పై భారీ స్కోరు చేసి, లంక టీంపై ఒత్తిడి పెంచాలన్నది అతని ఆలోచన. కానీ శ్రీలంక బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో ఈ ప్లాన్‌పై నీళ్లు చల్లారు.

  • Written By:
  • Publish Date - September 1, 2023 / 02:26 PM IST

BAN vs SL: ఆసియా కప్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక ఘనంగా ఆరంభించింది. తమ తొలి మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్‌ను చిత్తు చేసింది. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. డ్రై పిచ్‌పై భారీ స్కోరు చేసి, లంక టీంపై ఒత్తిడి పెంచాలన్నది అతని ఆలోచన. కానీ శ్రీలంక బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో ఈ ప్లాన్‌పై నీళ్లు చల్లారు. లంక స్పిన్నర్ తీక్షణ, యంగ్ పేసర్ పతిరాణా అద్భుతంగా బౌలింగ్ చేశారు.

ముఖ్యంగా పతిరాణా ఏకంగా నాలుగు వికెట్లు తీసుకొని చెలరేగాడు. దీంతో బంగ్లా టీం ఏ దశలోనూ భారీ స్కోరు దిశగా సాగలేదు. కేవలం నజ్ముల్ షాంటో 89 పరుగులతో మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. బంగ్లా టీంలో ఏడుగురు ప్లేయర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో బంగ్లా కేవలం 164 పరుగులకే ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్య ఛేదనను లంక కూడా తడబడుతూనే ఆరంభించింది. అయితే మిడిలార్డర్‌లో సమర విక్రమ, చరిత్ ఆశలంక అద్భుతంగా పోరాడి శ్రీలంకను విజయతీరాలకు చేర్చారు.

బంగ్లాపై ఘనవిజయంతో ఆసియా కప్ 2023ను శ్రీలంక అద్భుతంగా ఆరంభించింది. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో కూడా విఫలమైన బంగ్లాదేశ్ ఆట చూస్తుంటే, నేపాల్‌తో కుడా గెలవలేరేమో అన్న అనుమానం కలుగుతోంది అనే కామెంట్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై కనిపిస్తున్నాయి.