IPL 2023: సన్ రైజర్స్ మెరుపు ఆటతో కోలకత్తా వెనుకంజ..

ఐ పి ఎల్ 2023 లో అత్యధిక టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో కె కె ఆర్ అద్భుత పోరాటపటిమను చాటి చూపింది. సన్ రైజర్స్ విధించిన 229 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో తగ్గేదేలే అన్నట్టు, కె కె ఆర్ రెచ్చిపోయింది.

  • Written By:
  • Publish Date - April 15, 2023 / 04:00 PM IST

ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ గుర్బాజ్ ను అవుట్ చేసి, మంచి శుభారంభం అందుకున్న సన్ రైజర్స్, మంచి జోరును కనబరచి విక్టరీ వైపు దూసుకెల్లింది. ఇక జగదీష్, నితీష్ రానా, రింకు సింగ్ ల ధాటికి, ఆరెంజ్ ఆర్మీ ఆకాశానికి చూడ్డానికి టైమ్ పట్టింది. కేవలం 41 బంతుల్లో 75 పరుగులు చేసిన కెప్టెన్ రానా, సన్ రైజర్స్ కు కొద్దిసేపు చెమటలు పట్టించాడు.

ఐదు సిక్సర్ల హీరో రింకు సింగ్, కూడా మరోసారి చెలరేగి ఆడుతూ అర్థ సెంచురీని సాధించాడు. భారీ లక్ష్య ఛేదనలో కె కె ఆర్ 23 పరుగులతో వెనుకంజ వేసింది. సన్ రైజర్స్ బౌల్ర్లలో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ లు భారీగా పరుగులు సమర్పించుకుని, అభిమానులను మరోసారి నిరాశపరిచారు. ఈ విజయంతో సన్ రైజర్స్ ఏడవ ప్లేస్ కి మెరుగుపడగా, కె కె ఆర్ ఫోర్త్ ప్లేస్ కి పడిపోయింది. భయానక ఇన్నింగ్స్ తో హ్యారీ బ్రూక్ చేసిన విధ్వంసంతో సన్ రైజర్స్ జట్టు మరింత పటిష్టంగా తయారైంది. ఇక కె కె ఆర్ తన తదుపరి మ్యాచ్, ముంబై ఇండియన్స్ తో ఆడనుంది. సన్ రైజర్స్ తదుపరి పోరు కూడా ముంబై ఇండియన్స్ తోనే జరగనుంది.