Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడు కనబర్చింది. తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించింది. ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోసారి ఆమెనే వేలం టీమ్‌ను లీడ్ చేసింది. జట్టుకు లోటుగా ఉన్న టాపార్డర్ లెఫ్టార్మ్ బ్యాటర్, స్పెషలిస్ట్ స్పిన్నర్, పేస్ ఆల్‌రౌండర్‌ను భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది.
SALAAR: ప్రభాస్ డ్యుయల్ రోల్ కన్ఫార్మ్.. ఇంకెన్ని సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశావ్ నీల్ మావా..
ట్రావిస్ హెడ్‌ను రూ.6.80 కోట్లకు కొనుగోలు చేసి వేలాన్ని మొదలుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. వానిందు హసరంగాను రూ.కోటి 50 లక్షలకే దక్కించుకుంది. ఇక ప్యాట్ కమిన్స్ కోసం రూ.20.50 కోట్లు ఖర్చు చేసింది. ఆర్‌సీబీతో తీవ్రంగా పోటీ పడి మరి తీసుకుంది. అయితే టీమ్ బలహీనతలను అధిగమించినా.. పూర్తిగా ఓవర్‌సీస్ ఆటగాళ్లను కొనుగోలు చేయడంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ‘కావ్య పాపకు ఎవరైనా చెప్పండ్రా.. తుది జట్టు ఆడేది నలుగురు ఓవర్‌సీస్ ఆటగాళ్లే’ అని సెటైర్లు పేల్చుతున్నారు. ఇప్పటికే ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, గ్లేన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్ వంటి ఓవర్‌సీస్ ఆటగాళ్లున్నారు. అయినా సన్‌రైజర్స్ తమ బలహీనతలను ఓవర్‌సీస్ ఆటగాళ్లతో భర్తీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు వెంకటేశ్ ప్రసాద్ సైతం సన్‌రైజర్స్ హైదరాబాద్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. దేశీయ ఆటగాళ్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫోకస్ పెట్టాల్సిందని అభిప్రాయపడ్డాడు.
అయితే, మరికొందరు మాత్రం.. ‘కావ్యను అంత ఈజీగా తీసుకోకండి. ఎన్నో లెక్కలు ఉంటేనే ఒక ప్లేయర్‌ను కొనుగోలు చేస్తారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును మరింత బలోపేతం చేయడానికే కావ్య కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుందేమో’ అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా.. ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసిన ఇద్దరు ఆటగాళ్లు కూడా.. ఒంటి చేత్తో మ్యాచును మలుపుతిప్పే ఘనులే. సన్‌రైజర్స్ బ్యాటింగ్ బలానికి ఇప్పుడు ట్రావిస్ హెడ్ రూపంలో మరో ఆటగాడు తోడయ్యాడు. అసలు సమయంలో తడబడే ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్‌కి, ఇప్పుడు పాట్ కమిన్స్ ఒక సీనియర్ బౌలర్‌గా అన్ని తానై ముందుండి నడపబోతున్నాడు.