Sunrisers Hyderabad: ట్రావిస్ హెడ్ మెరుపు సెంచరీ.. సొంత రికార్డ్ బ్రేక్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్

నిర్ణీత 20 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. అంతకుముందు ఎస్‌ఆర్‌హెచ్ పేరుతో ఉన్న అత్యధిక స్కోరు 277 రికార్డును తనే బ్రేక్ చేయడం విశేషం. సోమవారం బెంగళూరుతో జరుగుతున్న మ్యాచులో 39 బంతుల్లోనే ట్రావిస్ హెడ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

  • Written By:
  • Publish Date - April 15, 2024 / 09:19 PM IST

Sunrisers Hyderabad: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు తన అత్యధిక స్కోర్ రికార్డును ఎస్‌ఆర్‌హెచ్ బ్రేక్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. అంతకుముందు ఎస్‌ఆర్‌హెచ్ పేరుతో ఉన్న అత్యధిక స్కోరు 277 రికార్డును తనే బ్రేక్ చేయడం విశేషం. సోమవారం బెంగళూరుతో జరుగుతున్న మ్యాచులో 39 బంతుల్లోనే ట్రావిస్ హెడ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Pooja Hegde: 45 కోట్ల ఇంటితో వివాదం కొనితెచ్చుకున్న హీరోయిన్

ట్రావిస్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండటం విశేషం. ట్రావిస్ హెడ్ సిక్సర్లు, ఫోర్లతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విధ్వంసం సృష్టించాడు. అంతకుముందు 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం 19 బంతుల్లోనే మరో 50 రన్స్ పూర్తి చేసుకుని, సెంచరీ సాధించాడు. ఈ మ్యాచులో టాస్ గెలిచి.. బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్లుగా వచ్చిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్.. మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడారు. ఒకవైపు ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడుతుంటే.. అభిషేక్ శర్మ కూడా అదే పంథాలో బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించారు. అభిషేక్ శర్మ 31 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ కూడా దూకుడుగా ఆడుతున్నాడు.

ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ 41 బంతుల్లో 102 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత క్లాసెన్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత వచ్చిన మార్క్‌రమ్, క్లాసెన్ కలిసి హైదరాబాద్‌ను భారీ స్కోరు దిశగా తీసుకెళ్లారు. ఆ తర్వాత 31 బంతుల్లో 67 పరుగులు చేసి క్లాసెన్ ఔటయ్యాడు. అనంతరం మార్క‌రమ్, సమద్ కలిసి హైదరాబాద్ జట్టుకు భారీ స్కోరు అందించారు. హైదరాబాద్ బ్యాటర్లను బెంగళూరు బ్యాటర్లు కట్టడి చేయలేకపోయారు.