Prithivi Shah: వచ్చేయ్ పృథ్వి కుమ్మేద్దాం

ఐపీఎల్ 2023 సీజన్‌లో దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. టీమ్ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - June 26, 2023 / 04:25 PM IST

14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్స్ టేబుల్‌లో చిట్ట చివరి స్థానంలో నిలవడంపై టీమ్ ఓనర్ కావ్య మారన్ ఆగ్రహంగా ఉన్నట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. కోట్లు పెట్టిన కొనుగోలు చేసిన ఆటగాళ్లు దారుణంగా విఫలమవడం.. జట్టు ఘోర పరాజయాలు ఎదుర్కొవడాన్ని కావ్య మారన్ అవమానకరంగా భావించినట్లు తెలుస్తోంది. టీమ్ హెడ్ కోచ్ బ్రియాన్ లారా పనితీరుపై కూడా అసంతృప్తిగా ఉన్న కావ్య మారన్.. జట్టుతో పాటు సపోర్ట్ స్టాఫ్‌ను మార్చే యోచనలో ఉన్నట్లు టీమ్‌కు చెందిన ఓ అధికారి పేర్కొన్నాడు.

‘ఐపీఎల్ 2024 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. టీమ్ ఘోర పరాజయం పట్ల ఓనర్ కావ్య మారన్ ఆగ్రహంగా ఉన్నారు. జట్టుకు అవసరమైన మార్పులు చేసేందుకు సిద్దంగా ఉన్నారు. మినీ వేలం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ప్రతిభ కలిగిన యువ ఆటగాళ్లను అన్వేషించేందుకు టాలెంట్ స్కౌట్స్ కూడా నియమించారు. ట్రేడింగ్ విండోపై కూడా ఫోకస్ పెట్టారు. ఇతర జట్లలోని స్టార్ ఆటగాళ్లను తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. శుభ్‌మన్ గిల్‌తో పాటు పృథ్వీ షాను ట్రేడింగ్ విండో ద్వారా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలతో చర్చలు కూడా జరిపారు. వారి కోసం స్టార్ పేసర్లను కూడా వదులుకుంటామనే ఆఫర్ ఇచ్చారు.’అని సదరు అధికారి పేర్కొన్నాడు.

మరోవైపు ఐపీఎల్ 2023 సీజన్‌లో పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యాడు. అతని వైఫల్యం ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచింది. పేలవ ఆటతీరుతో తుది జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా మొత్తం 8 మ్యాచ్‌లే ఆడి ఓ హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులే చేశాడు. ఆ హాఫ్ సెంచరీ కూడా చివరగా ఢిల్లీ 13వ మ్యాచ్‌లో చేశాడు. పృథ్వీ షా వైఫల్యం.. టీమ్ బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. డేవిడ్ వార్నర్‌తో పాటు మిచెల్ మార్ష్, మనీశ్ పాండేలపై ఒత్తిడి నెలకొల్పింది. పృథ్వీ షా పేలవ ఆటతీరు కారణంగా మిచెల్ మార్ష్ సైతం ఆరంభ మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతన్ని వదులుకునేందుకు ఢిల్లీ సిద్దమవ్వగా.. తీసుకునేందుకు సన్‌రైజర్స్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతో టాలెంట్ ఉన్న పృథ్వీషాకు సరైన గైడెన్స్ ఇస్తే ఫలితం రాబట్టవచ్చని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది.