SUNRISERS HYDERABAD: సన్ రైజర్స్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. తుది జట్టులో ఫారిన్ ప్లేయర్స్ ఎవరంటే..?

విదేశీ ప్లేయర్స్ కోసం కోట్లు కుమ్మరించిన సన్ రైజర్స్ యాజమాన్యం తుది జట్టులో ఎవరిని ఆడిస్తుంది.. ఎవరిని బెంచ్‌లో కూర్చోబెడుతుందనే చర్చ జరుగుతోంది. కమ్మిన్స్, హెడ్, హసరంగల రాకతో విదేశీ ఆటగాళ్ళ కూర్పు మరింత తలనొప్పిగా మారింది.

  • Written By:
  • Publish Date - December 25, 2023 / 08:26 PM IST

SUNRISERS HYDERABAD: ఐపీఎల్ 17వ సీజన్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. మినీ వేలం కూడా ఇటీవలే ముగిసింది. ఊహించినట్టుగానే విదేశీ స్టార్ ప్లేయర్స్‌పై కాసుల వర్షం కురిసింది. మినీ వేలంలో అత్యధిక బిడ్డింగ్ సొంతం చేసుకున్న ఇద్దరు ఆటగాళ్లలో ఒకరిని సన్ రైజర్స్ సొంతం చేసుంది. కమ్మిన్స్‌ను 20.5 కోట్లకు దక్కించుకుంది. ఇప్పుడు సన్‌రైజర్స్ తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనే ఆసక్తి మొదలైంది.

ROHIT SHARMA: టీ20 వరల్డ్ కప్ ఆడతారా..? రోహిత్ ఏం చెప్పాడంటే..

విదేశీ ప్లేయర్స్ కోసం కోట్లు కుమ్మరించిన సన్ రైజర్స్ యాజమాన్యం తుది జట్టులో ఎవరిని ఆడిస్తుంది.. ఎవరిని బెంచ్‌లో కూర్చోబెడుతుందనే చర్చ జరుగుతోంది. కమ్మిన్స్, హెడ్, హసరంగల రాకతో విదేశీ ఆటగాళ్ళ కూర్పు మరింత తలనొప్పిగా మారింది. విశ్లేషకుల అంచనా ప్రకారం ట్రావిస్ హెడ్‌ను తీసుకోవడంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ మరింత బలంగా మారింది. వార్నర్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా అతనికే ఉందని చెప్పొచ్చు. అలాగే గత సీజన్ కెప్టెన్ మక్రమ్ కూడా కొనసాగనుండగా.. గ్లెన్ ఫిలిప్స్, క్లాసన్, హసరంగ, కమ్మిన్స్‌లో ఇద్దరికే అవకాశముంటుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న క్లాసన్‌ను తుది జట్టులో నుంచి తప్పించడం కష్టం. మిగిలిన ఒక స్థానంలో కమ్మిన్స్, హసరంగా రేసులో ఉన్నారు.

ఏకంగా 20.5 కోట్లు పెట్టి కొన్న కమ్మిన్స్‌ను బెంచ్‌పై కూర్చొబెట్టే పరిస్థితి ఉండకపోవచ్చు. దీంతో తుది జట్టులో కమ్మిన్స్‌ను.. అది కూడా సారథిగా నియమిస్తే ఇక ఢోకానే ఉండదు. అయితే స్పిన్నర్ హసరంగాను రొటేషన్ పద్ధతిలో ఆడించే అవకాశముంటుంది. మొత్తం మీద విదేశీ ప్లేయర్ల కోటాలో సన్ రైజర్స్ తరపున హెడ్, మక్రమ్, కమ్మిన్స్, క్లాసెన్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.