ఐపీఎల్ 17వ (IPL 17) సీజన్‌లో చారిత్రాత్మక విజయాన్నందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న హైదరాబాద్.. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) వేదికగా సొంతగడ్డపై జరిగిన రెండో మ్యాచ్‌లో సంచలన ప్రదర్శనతో సత్తా చాటింది.
విధ్వంసకర బ్యాటింగ్‌తో టీ20 క్రికెట్ చరిత్రలోనే 277 పరుగుల అత్యధిక స్కోర్‌ను నమోదు చేసి రికార్డు సృష్టించింది. కాగా ముంబై తో మ్యాచ్ లో రాహుల్ త్రిపాఠి (Rahul Tripathi), మార్కో జాన్సెన్‌లపై వేటు వేసి ఓపెనర్‌గా ట్రావిస్ హెడ్‌ను బరిలోకి దింపింది. గాయంతో దూరమైన నటరాజన్ స్థానంలో ఉనాద్కత్‌ను తీసుకొచ్చింది. ఈ కాంబినేషన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సంచలన విజయాన్ని అందించింది.
ఇదే జోరునే అహ్మదాబాద్‌లోని వరల్డ్ బిగ్గెస్ట్ నరేంద్రమోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) చూపించాలనుకుంటోంది. విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. నటరాజన్ ఫిట్‌నెస్ సాధిస్తే స్వల్ప మార్పులు చేయనుంది. పేలవ ప్రదర్శన కనబర్చిన ఉమ్రాన్ మాలిక్ స్థానంలో నటరాజన్‌ను బరిలోకి దించనుంది. మిగతా కాంబినేషన్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్ ఆడనుండగా.. మిడిలార్డర్‌లో అభిషేక్ శర్మ (Abhishek Sharma), ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్ బరిలోకి దిగనున్నారు. మార్పులు చేసే అవకాశం లేకపోవడంతో రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిలకు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది.