SURYA KUMAR YADAV: ఐపీఎల్ 17వ సీజన్‌కు ఫ్రాంచైజీలు సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. ఇటీవలే ముగిసిన మినీ వేలంలో పలువురు ఆటగాళ్ళను కొనుగోలు చేసి తమ జట్లను బలంగా మార్చుకున్నాయి. వచ్చే సీజన్‌లో తుది జట్టుకు ఎవరు అందుబాటులో ఉంటారనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే కీలక ఆటగాళ్ల గాయాలు వారిని టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్‌కు షాక్ తగిలింది.
Dhoni : హుక్కా తాగుతూ ధోని పోజులు.. ఏమైంది తలైవా.. ఇలా తయారయ్యావ్..
టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 17వ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఇప్పటికే చీలమండ గాయంతో బాధపడుతున్న ఈ డాషింగ్ బ్యాటర్ స్పోర్ట్స్ హెర్నియా వల్ల అతడు ఇబ్బందిపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సర్జరీ కోసం సూర్యకుమార్ జర్మనీ వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్న అతను రెండు- మూడు రోజుల్లో సర్జరీ కోసం జర్మనీలోని మ్యూనిచ్‌కు పయనమవుతాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో రంజీ ట్రోఫీతో పాటు ఐపీఎల్ 2024 ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ ట్వంటీ వరల్డ్‌కప్ మొదలు కానుండడంతో సూర్యకుమార్ పూర్తిస్థాయిలో కోలుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.
చీలమండ నొప్పి కారణంగానే సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే అఫ్గనిస్తాన్‌తో టీ ట్వంటీ సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా సూర్య.. ఆరంభ మ్యాచ్‌లకు దూరమైతే ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టే. ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. పాండ్యా రీఎంట్రీపై క్లారిటీ లేకపోవడం, తాజాగా సూర్యకుమార్ గాయం ముంబై మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి.