క్రికెట్ లో క్యాచెస్ విన్ మ్యాచ్ స్ అంటారు..ఎవ్వరైనా సరే ఇది అంగీకరించాల్సిందే…ఎందుకంటే ఎంత భారీస్కోర్ చేసినా బౌలింగ్ కు తగ్గట్టు ఫీల్టింగ్ మరీ ముఖ్యంగా ప్రత్యర్థి బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్ లు అందుకోకుంటే మ్యాచ్ చేజారిపోతుంది. అందుకే క్రికెట్ లో సెంచరీలు ఎంత ముఖ్యమో క్యాచ్ లు కూడా అంతే ముఖ్యం. క్యాచ్ లతోనే మ్యాచ్ లు మలుపు తిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా వరల్డ్ కప్ ఫైనల్లో సూర్యుకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మ్యాచ్ ను టర్న్ చేయడమే కాదు భారత్ కు వరల్డ్ కప్ అందించింది.
చివరి ఓవర్లో విజయం కోసం 16 పరుగులు చేయాల్సి ఉండగా పాండ్యా వేసిన తొలి బంతినే డేవిడ్ మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ కొట్టాడు. దాదాపు సిక్సర్‌గా దూసుకెళ్లిన ఈ బంతిని సూర్య బౌండరీ లైన్‌పై చాకచక్యంగా అందుకున్నాడు. ముందుగా సిక్సర్‌ను అడ్డుకొని బంతిని ఒడిసి పట్టుకు సూర్య.. సమన్వయం కోల్పోవడంతో గాల్లోకి విసిరేసాడు. మళ్లీ మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు. ఒకవేళ స్కై ఈ క్యాచ్ వదిలేసి ఉంటే సిక్సర్‌గా వెళ్లేది. తర్వాత భారత్ విజయం లాంఛనమైంది సూర్య సంచలన క్యాచ్ తో భారత్ కప్ గెలిచిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. సూర్య పట్టుకుంది బంతిని కాదు వరల్డ్ కప్ అంటూ ప్రశంసిస్తున్నారు.