Suryakumar Yadav: ముసుగు ధరించి జనంలోకి వచ్చిన క్రికెటర్.. ఎందుకోసమంటే..

టీమిండియాకు సంబంధించి ముంబై ప్రజల మనోగతాలను తెలుసుకునేందుకు, అలాగే అతని బ్యాటింగ్ గురించి కూడా ప్రశ్నలు అడిగాడు. సూర్యకుమార్ మొహానికి ముసుగు, అద్దాలు, టోపీ పెట్టుకుని గుర్తుపట్టకుండా తయారయ్యాడు.

  • Written By:
  • Publish Date - November 1, 2023 / 03:57 PM IST

Suryakumar Yadav: వన్డే ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు తన తదుపరి మ్యాచ్‌ని శ్రీలంకతో ఆడాల్సి ఉంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రేపు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ముంబై చేరుకున్న టీమిండియా.. మ్యాచ్ సన్నాహాల్లో బిజీగా ఉంది. ఇంతలో భారత జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ భిన్నమైన రూపంలో సందడి చేశాడు.

ఇదే రూపంతో అతను ముంబై ప్రజల మధ్యకు చేరుకున్నాడు. ఈ సమయంలో అతను టీమిండియాకు సంబంధించి ముంబై ప్రజల మనోగతాలను తెలుసుకునేందుకు, అలాగే అతని బ్యాటింగ్ గురించి కూడా ప్రశ్నలు అడిగాడు. సూర్యకుమార్ మొహానికి ముసుగు, అద్దాలు, టోపీ పెట్టుకుని గుర్తుపట్టకుండా తయారయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన బ్యాటింగ్‌పై అభిమానులను ప్రశ్నిస్తే.. సమాధానాలు విని ఆశ్చర్యానికి గురయ్యాడు. సూర్యకుమార్ కెమెరామెన్‌గా అభిమానుల మధ్యకు వచ్చాడు. టాటూలు కనిపించకుండా నిండుగా చొక్కా ధరించి.. జనాలు తన ముఖం గుర్తుపట్టకుండా మాస్క్, గ్లాసెస్ ధరించి.. అభిమానులు గుర్తుపట్టకుండా తలపై క్యాప్ కూడా ధరించారు.

అతని రూపురేఖలు చూసి రవీంద్ర జడేజా కూడా గుర్తించలేకపోయాడు. సూర్యకుమార్ మెరైన్ డ్రైవ్‌లో కెమెరాతో బయటకు వచ్చి, టీమ్ ఇండియా గురించి ప్రశ్నలు సంధించాడు. అభిమానులంతా టీమ్‌ ఇండియాపై ప్రశంసలు కురిపిస్తూ.. ఈసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.