SURYAKUMAR YADAV: షార్ట్ ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ గ్రౌండ్‌లో అన్ని వైపులా షాట్లు కొట్టే మొనగాడిగా అతనికి పేరుంది. టీమిండియా మిస్టర్ 360గా ఫ్యాన్స్ పిలుచుకునే సూర్యకుమార్ యాదవ్‌కు ఐసీసీ అరుదైన గౌరవాన్నిచ్చింది. 2023 అత్యుత్తమ టీ ట్వంటీ టీమ్‌కు సారథిగా సూర్యకుమార్‌ను ప్రకటించింది. గతేడాది టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 11 మంది ఆటగాళ్లను జట్టుగా ఐసీసీ ప్రకటించింది.
Virat Kohli: కోహ్లీ రీప్లేస్‌మెంట్ ఎవరు.. ఆ ముగ్గురిలో ఒకరికి ఛాన్స్..
దీనికి కెప్టెన్‌గా సూర్యానే ఎంపిక చేసింది. సూర్యకుమార్ గత ఏడాది టీ ట్వంటీల్లో విధ్వంసం సృష్టించాడు. 17 ఇన్నింగ్స్‌లో 48 సగటుతో, 155 స్ట్రైక్ రేటుతో 733 పరుగులు చేశాడు. దీనిలో రెండు సెంచరీలు ఉన్నాయి. అంతేగాక 2023 ఏడాదికి ఉత్తమ టీ20 క్రికెటర్ ఐసీసీ అవార్డుకు సూర్య ఎంపికయ్యాడు. సూర్యకుమార్‌తో మరో ముగ్గురు టీమిండియా యువ ప్లేయర్లు ఐసీసీ టీ20 జట్టుకు ఎంపికయ్యారు. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ అర్షదీప్ సింగ్ చోటు దక్కించుకున్నారు.
గతేడాది ఆగస్టులో అరంగేట్రం చేసిన జైశ్వాల్ 14 ఇన్నింగ్స్‌ల్లో 430 పరుగులు చేశాడు. నంబర్ వన్ బౌలర్ ర్యాంక్ అందుకున్న బిష్ణోయ్ 18 వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్ గతేడాది 21 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు పడగొట్టాడు. కాగా ఇటీవలే హెర్నియా సమస్యకు సర్జరీ చేయించుకున్న సూర్యకుమార్ కోలుకునేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది.