SURYAKUMAR YADAV: టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సర్జరీ సక్సెసయింది. హెర్నియా సమస్యతో బాధ పడుతున్న సూర్య జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. తాను త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపిన వారికి సూర్యకుమార్ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు చెప్పాడు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫొటోను ట్వీట్ చేశాడు. త్వరలో పునరాగమనం చేస్తా అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
RETIRED SCAM : రూ.1800 కోట్లు కొట్టేశారా ? రిటైర్డ్ అయినా పదవుల్లోనే 1049మంది
అతను పూర్తి ఫిట్‌నెస్ తిరిగి పొందడానికి కనీసం ఒక నెల సమయం పడుతుందని తెలుస్తోంది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-17 నాటికి పునరాగమనం చేసే అవకాశం ఉంది. అయితే ఎన్‌సీఎలో ఫిట్‌నెస్ టెస్ట్ పాసవ్వాల్సి ఉంటుంది. దీంతో ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు సూర్య.. దూరమయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. రాబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధించి, తిరిగి రావాలని సూర్యకుమార్ యాదవ్‌కు బీసీసీఐ సూచించింది. దీని ప్రకారం టీ20 ప్రపంచకప్‌కు కొద్దిరోజుల ముందు అతను మైదానంలో అడుగుపెట్టే అవకాశముంది.
ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరమైనా.. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో సూర్య రీఎంట్రీ ఖాయమని చెప్పొచ్చు. మిగిలిన ఫార్మాట్ల సంగతి ఎలా ఉన్నా.. టీ ట్వంటీల్లో సూర్య ఎలాంటి స్టార్ ప్లేయరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీ ట్వంటీల్లో నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్య.. ఇప్పటి వరకు 57 ఇన్నింగ్స్‌లు ఆడి 171.55 స్ట్రైక్ రేటుతో 2141 పరుగులు చేశాడు.