MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్‌.. మీ ఉచిత సలహాలు ఆపండి.. చేసింది చాలు..  మళ్లీ సూర్యా అంట..!

టీ20ల్లో నంబర్‌ 1 ర్యాంక్‌లో కొనసాగుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ వన్డేల్లో మాత్రం పెద్ద జీరో! కొందరికి కొన్నే సెట్‌ అవుతాయి. సూర్యకి వన్డేలు సరిపోవు అనుకుంటా. ఆ ఫార్మాట్‌లో అతను ఫిట్‌ అవ్వడు అనుకుంటా. మరోవైపు తిలక్‌ వర్మని వన్డేలకు ఎంపిక చేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.

  • Written By:
  • Publish Date - August 11, 2023 / 01:32 PM IST

MSK Prasad: ఉచిత సలహాలు ఇచ్చేవాళ్లలో చుట్టాలే కాదు.. క్రికెట్‌లో మాజీ సెలక్టర్లు కూడా ఉంటారు. ఎమ్మెస్కే ప్రసాద్‌ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌. 2019లో నంబర్‌ 4 బ్యాటింగ్‌ పొజిషన్‌పై ఆయన తీసుకున్న నిర్ణయం టీమిండియాకు ప్రపంచ కప్‌ దూరం చేసినా.. ఇప్పటికీ తన తీరు మార్చుకోలేదు!
26 వన్డేలు.. రెండంటే రెండే హాఫ్‌ సెంచరీలు.. అతడి యావరేజ్‌ 24మాత్రమే.. రెండేళ్లుగా ఛాన్స్‌లు ఇస్తూనే ఉన్నారు. అయినా జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేదు. అతడే టీ20ల్లో ప్రపంచంలో ఎవరికీ అందనంత ఎత్తులో.. నంబర్‌ 1 ర్యాంక్‌లో కొనసాగుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌. టీ20ల్లో టాప్‌లో ఉన్నా.. వన్డేల్లో మాత్రం పెద్ద జీరో! కొందరికి కొన్నే సెట్‌ అవుతాయి. సూర్యకి వన్డేలు సరిపోవు అనుకుంటా. ఆ ఫార్మాట్‌లో అతను ఫిట్‌ అవ్వడు అనుకుంటా. అయినా కూడా మనోళ్లు సూర్యని ఇరికించేందుకు చూస్తున్నారు. వన్డే ప్రపంచకప్‌కి టైమ్‌ దగ్గర పడుతుండగా ఇప్పటివరకు నంబర్‌ 4 పొజిషన్‌లో ఎవరు బ్యాటింగ్‌ చేయాలన్నదానిపై ఓ క్లారిటీ లేదు. అప్పుడెప్పుడో యువరాజ్‌ రిటైర్మెంట్‌ తర్వాత నుంచి ఖాళీగా ఉన్న ఆ ప్లేస్‌ని ఫిల్‌ చేసే దేవుడే లేకుండాపోయాడు.
13 వన్డేలు.. 55యావరేజ్‌.. 104 స్ట్రైక్‌ రేట్‌.. ప్రొఫెషనల్‌ వికెట్ కీపర్‌.. ఇది సంజూ శాంసన్‌ ODI గణాంకాలు. వన్డేల్లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సంజూని పాపం పట్టించుకునేవాడే లేడు. నంబర్‌ 4 పొజిషన్‌లో సంజూకు అవకాశాలు ఇవ్వడంలేదు. అంతా ద్రవిడ్‌గారి వింత ప్రయోగాలతోనే కాలం గడిచిపోతుంది. ఈలోపే మాజీ సెలక్టర్.. 2019 వరల్డ్‌కప్‌ విలన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ఎంట్రీ ఇచ్చారు. నంబర్‌ 4లో సూర్యకుమార్‌ యాదవ్‌ని ఆడించాలని ఉచిత సలహా ఇచ్చాడు. క్రికెట్‌లో ఎవరు ఔనన్నా. కాదన్నా గణాంకాలే ప్రమాణం. అవి కనపడకపోతే కళ్లజోడు పెట్టుకోవాలి. అయినా కనపడకపోతే పక్కన వాళ్లని అడిగి చెవులు పెద్దవి చేసుకుని వినాలి. 2019లో ఈ రెండు చేయక పోవడంవల్లే రాయుడు అన్యాయం ఐపోయాడు. సెమీస్‌లో బ్యాటింగ్‌లో నిలబడేవాడు ఉండి ఉంటే ఫైనల్‌కి వెళ్లేవాళ్లం కదా.. ఇప్పడు కూడా అదే తప్పు చేయమని ఎమ్మెస్కే ప్రసాద్‌ ఎలా చెబుతారు..?
మరోవైపు తిలక్‌ వర్మని వన్డేలకు ఎంపిక చేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. టీ20ల్లో వచ్చిన ఛాన్స్‌లను సద్వినియోగం చేసుకున్న తిలక్‌ వర్మ డెడికేషన్‌ యువరాజ్‌ని తలపిస్తోంది. అందుకే రానున్న ఏషియా కప్‌లో తిలక్‌ని పరీక్షించాలని, వరల్డ్‌ కప్‌ జరిగేది ఎలాగో ఇండియా పిచ్‌లపైనే కాబట్టి అనుభవం లాంటివి పట్టించుకోకుండా అంకితభావంతో ఆడే తిలక్‌కి అవకాశం ఇవ్వాలన్న వాదన వినిపిస్తోంది. గతేడాది టీ20 వరల్డ్‌ కప్‌లో అనుభవం లేదన్న సాకుతో ఫామ్‌లో ఉన్న సిరాజ్‌ని కాకుండా షమీని తుది జట్టులో ఆడించి భారీ మూల్యం చెల్లించుకుంది టీమిండియా. షమీ అప్పుడే గాయం నుంచి కోలుకుని ఉన్నాడు. అయినా సిరాజ్‌కి ఛాన్స్‌ రాలేదు. ఆ తప్పునే రిపీట్ చేయకుండా తిలక్‌ని ఆడిస్తే బాగుంటుందన్న ఆలోచన క్రికెట్ సర్కిల్స్‌లో ఇలా వచ్చిందో లేదో.. ఇంతలోనే ఎమ్మెస్కే ఎంటర్ ఐపోయారు. సూర్యని నంబర్‌ 4లో ఆడించాలంటూ సలహా ఇచ్చేశాడు. తిలక్‌ కూడా తెలుగువాడే. రాయుడు కూడా తెలుగువాడే. కానీ ఎమ్మెస్కే ఏంటో, ఆయన సిద్ధాంతాలు ఏంటో అర్థంకావు. ఆయన ఆలోచనలను అర్థం చేసుకోవాలంటే సామాన్య మనుషులకు సాధ్యపడదు..!