Aakash Chopra: ఫుల్ టైం బ్యాట్స్‌మెన్ కాదు.. పార్ట్ టైం బౌలర్ కాదు..

ఐసీసీ ఈవెంట్‌కు అక్కర్లేదనుకున్న వాళ్లను ఆసియా కప్‌-2023 టోర్నీకి ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించాడు. హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మను కాదని సూర్యకుమార్‌ యాదవ్‌ను సెలక్ట్‌ చేయడం వెనుక ఉద్దేశమేమిటో అర్థం కాలేదని వాపోయాడు.

  • Written By:
  • Publish Date - September 4, 2023 / 05:35 PM IST

Aakash Chopra: టీమిండియా సెలక్టర్ల తీరుపై మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అసహనం వ్యక్తం చేశాడు. ఐసీసీ ఈవెంట్‌కు అక్కర్లేదనుకున్న వాళ్లను ఆసియా కప్‌-2023 టోర్నీకి ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించాడు. హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మను కాదని సూర్యకుమార్‌ యాదవ్‌ను సెలక్ట్‌ చేయడం వెనుక ఉద్దేశమేమిటో అర్థం కాలేదని వాపోయాడు.

అయితే, ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడిన భారత జట్టులో తిలక్‌ వర్మకు చోటు దక్కలేదు. అదే విధంగా.. నేపాల్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లోనూ ఆడటం లేదు. మరోవైపు.. వరల్డ్‌కప్‌- 2023కి ఇదే ప్రొవిజినల్‌ జట్టు అన్న బీసీసీఐ.. 15 మంది సభ్యుల టీమ్‌ నుంచి తిలక్‌ వర్మతో పాటు యువ పేసర్‌ ప్రసీద్‌ కృష్ణను తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన ఆకాశ్‌ చోప్రా.. ‘‘సూర్యకుమార్‌ ఆటంటే నాకూ ఇష్టమే. కానీ అతడిని వన్డే ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో తెలియడం లేదు. ఒకవేళ పార్ట్‌టైమ్‌ స్పిన్నర్లు కావాలనుకుంటే.. అతడు బౌలింగ్‌ చేయలేడు కదా!

ఇక తిలక్‌కు వన్డే ప్రపంచకప్‌ ప్రొవిజినల్‌ జట్టులో స్థానం ఇవ్వనపుడు ఆసియా కప్‌కు ఎంపిక చేసి ఉపయోగం ఏమిటి?’’ అని అసహనం వ్యక్తం చేశాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్‌ వేదికగా ఐసీసీ టోర్నీ ఆరంభం కానుంది. పుష్కరకాలం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌ ఈవెంట్‌లో ఆతిథ్య టీమిండియా హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.