టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మధ్య గత కొంత కాలంగా వైరం నడుస్తోంది. అయితే ఇదింతా ఒకప్పుడు. ఇప్పుడు వారిద్దరూ కలిసిపోయారు. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ స్ట్రాటజిక్ టైమ్‌లో గౌతం గంభీర్ (Gautam Gambhir), కోహ్లి ఇద్దరూ ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుంటూ హగ్ చేసుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య 11 ఏళ్లగా కొనసాగుతున్న వైర్యానికి తెరపడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు తమ అభిమాన క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కాగా తొలిసారిగా 2013 ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్- ఆర్‌సీబీ (KKR- RCB) మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత 2015 ఐపీఎల్ సీజన్‌లో మళ్లీ విరాట్, గౌతీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం 2023 ఐపీఎల్ సీజన్‌లో మరోసారి విరాట్, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నవీన్ ఉల్ హాక్-కోహ్లి మధ్య గొడవ జరగగా.. అందులో గంభీర్ జోస్యం చేసుకోవడంతో ఆ గొడవ మరింత తీవ్రమైంది. అయితే మళ్లీ ఏడాది తర్వాత ఇద్దరూ ఒకే మైదానంలో ఉండడంతో అందరి కళ్లు ఈ మ్యాచ్‌పైనే నిలిచాయి. అయితే అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఇద్దరూ మంచి మిత్రులయ్యారు.