MICHAEL VAUGHAN: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లకు నోటి దురుసు తగ్గడం లేదు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ భారత క్రికెట్ జట్టుపై మరోసారి నోరు పారేసుకున్నాడు. ఐసీసీ టోర్నీల్లో గత పదేళ్లుగా టీమిండియా విజేతగా నిలవలేకపోయిందంటూ విమర్శలు గుప్పించాడు. ప్రతిభ, వనరులకు కొదువ లేకున్నా టీమిండియా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిందని విమర్శించాడు. పదేళ్లుగా భారత్ ఏ టోర్నీ కూడా గెలవలేదని, ఆ జట్టు వల్ల ఏది కాదన్నాడు. టీమిండియా చివరగా ఎప్పుడు గెలిచిందని ప్రశ్నించాడు.
IPL vs PSL: పీఎస్‌ఎల్ కంటే ఐపీఎల్ బిగ్గెస్ట్ లీగ్.. సొంత బోర్డు గాలి తీసేసిన పాక్ మాజీ క్రికెటర్
నిజానికి తమ దగ్గర ఉన్న టాలెంట్‌తో టీమిండియా ఎన్నో విజయాలు అందుకోవాలనీ, కానీ అలా జరగలేదన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మాత్రమే టీమిండియా రెండు సార్లు టెస్టు సిరీస్ గెలిచిందన్నాడు. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లలో విజేతగా నిలవలేకపోయారని, భవిష్యత్తులో కూడా భారత్ ఐసీసీ టోర్నీలు గెలుస్తారని తాను అనుకోవడం లేదంటూ వాన్ వ్యాఖ్యానించాడు. అయితే వాన్ చేసిన కామెంట్స్‌పై భారత అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒకరిని విమర్శించే ముందు తమ సంగతి చూసుకోవాలంటూ కౌంటర్ ఇస్తున్నారు. మైకేల్ వాన్ ముందు తన సొంత జట్టు ఏం సాధించిందో చూసుకోవాలని రివర్స్ ఎటాక్ చేశారు. ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఎంత చెత్తగా ఆడిందో అందరూ చూశారంటూ టీమిండియా ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లీష్ టీమ్ కేవలం మూడే మ్యాచ్‌లు గెలిచిందన్నారు.
తమకంటే చిన్న జట్లు ఆప్ఘనిస్తాన్, శ్రీలంక చేతిలో ఓడిపోవడం వాన్‌కు గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్, పాక్ మాజీలకు భారత్ జట్టును విమర్శించడమే పనిగా పెట్టుకుంటారంటూ మన మాజీ ఆటగాళ్లు సైతం మండిపడుతున్నారు. గత కొన్నేళ్లుగా వరల్డ్ క్రికెట్‌లో భారత్ సాధించిన అత్యుత్తమ విజయాలు వారికి కనబడవని, కేవలం వార్తల్లో నిలిచేందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తారంటూ కౌంటర్ ఇస్తున్నారు.