TEAM INDIA: టెస్టు జట్లలో మళ్లీ మనమే టాప్.. కేప్‌టౌన్ విజయంతో అగ్రస్థానానికి భారత్‌

కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా 54.16 విజయాల శాతంతో సౌతాఫ్రికాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 2 గెలిచి ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

  • Written By:
  • Updated On - January 5, 2024 / 03:26 PM IST

TEAM INDIA: సఫారీ గడ్డపై చారిత్రక టెస్ట్ విజయం సాధించిన భారత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోనూ టాప్ ప్లేస్‌కు దూసుకొచ్చింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా 54.16 విజయాల శాతంతో సౌతాఫ్రికాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 2 గెలిచి ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. మరో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. వెస్టిండీస్‌ గడ్డపై 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. తాజా సౌతాఫ్రికా పర్యటనలో 1-1తో సమం చేసుకుంది.

YS JAGAN: వైసీపీ మూడో జాబితా సిద్ధం.. పది మంది సిట్టింగ్‌లకు షాక్ తప్పదా..?

దాంతో 26 పాయింట్లతో పాటు 54.16 విజయాల శాతంతో అగ్రస్థానానికి చేరింది. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ పరాజయం‌ అనంతరం స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు పాయింట్లు కోల్పోయిన టీమిండియా అగ్రస్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయింది. రెండు రోజుల్లోనే ముగిసిన కేప్‌టౌన్ టెస్ట్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. 6 స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లే ఆడిన సౌతాఫ్రికా ఒకటి ఓడి, మరొకటి గెలిచి 50 విన్నింగ్ పర్సంటేజ్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ కూడా 50 విజయాల శాతంతో మూడో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా అత్యధికంగా ఏడు మ్యాచ్‌లు ఆడింది. 2025 జూన్ వరకు సాగే ఈ టోర్నీలో టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. గత రెండు ఎడిషన్స్‌లో ఫైనల్ చేరిన టీమిండియా.. తృటిలో టైటిల్‌ను చేజార్చుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మూడో టెస్ట్ తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలిస్తే అగ్రస్థానానికి చేరుకునే అవకాశముంది.