Cricket World Cup 2023: వరల్డ్ కప్‌లో భారత్ (INDIA) జట్టు దూకుడు చూస్తుంటే ఆనందం.. పట్టరాని సంతోషం. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఏ రకంగా చూసినా ఎదురులేని జట్టు టీమిండియా. తాజా వరల్డ్ కప్‌లో ఓటమి ఎరుగని భారత జట్టును ఇప్పుడు ఒకే ఒక అనుమానం వేధిస్తోంది. అదే.. భారత్ సెమీఫైనల్స్ (semi finals), ఫైనల్స్ గండం గట్టెక్కగలదా..? ఇండియాలో ప్రతి క్రికెట్ అభిమాని పైకి మాట్లాడకపోయినా మనసులో వేధిస్తున్న ఒకే ఒక్క భయం సెమీఫైనల్ సెంటిమెంట్. ఓవరాల్ పర్ఫార్మెన్స్‌తో వరల్డ్ కప్‌లో టీం ఇండియా జైత్రయాత్ర సాగిస్తోంది. ఇది ఓకే..! మరి సెమీస్ సంగతేంటి..? రోహిత్ (ROHIT SHARMA) సేనకు సెమీస్ గండం పొంచి ఉందా..? గతంలో సెమీస్ దాకా వచ్చి బోల్తాపడిన అనుభవాలు ఏం చెప్తున్నాయ్..?
ప్రపంచ కప్‌లో టీం ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచులూ నెగ్గి జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో అత్యంత ప్రమాదకరం అనుకున్న సఫారీలను సైతం రోహిత్‌సేన రఫ్ఫాడించింది. 83 పరుగులకే సౌతాఫ్రికాను ఆలౌట్ చేసింది. వరల్డ్ కప్ టోర్నీల్లో వరుసగా అత్యధిక మ్యాచులు గెలిచిన టీంగా రికార్డు సృష్టించింది. రోహిత్ సేన ఓవరాల్ పర్ఫార్మెన్స్‌తో అధరగొడుతున్నా.. క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం కలవరపడుతున్నారు. టీం ఇండియాకి సెమీస్ గండంపొంచి ఉందంటున్నారు క్రికెట్ అనలిస్ట్‌లు. ఇప్పటికే అన్ని టీమ్‌లకంటే ముందే భారత్ సెమీస్ చేరింది. కానీ.. సెమీస్‌లో ఓడితే ఇక ఇంటికే. సెమీస్ చేరే టీమ్‌లు కూడా అంత ఆషామాషీ కాదు. బలమైన ప్రత్యర్థులతోనే భారత్ ఢీ కొనాల్సి ఉంటుంది. సౌతాఫ్రికా కూడా సెమీస్ చేరింది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కే సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మూడు టీమ్స్ తక్కువేం కాదు. మిగతా మూడు టీమ్‌లతో పోలిస్తే రోహిత్ సేన బలంగా కనిపిస్తున్నా.. గత సెమీస్ అనుభవాలు మాత్రం దడపుట్టిస్తున్నాయి. గతంలో కూడా వరుస విజయాలతో సెమీస్ చేరి.. సెమీస్‌లో బోల్తా కొట్టిన అనుభవాలు ఉన్నాయి. అలాంటి సీన్ ఈ వరల్డ్ కప్‌లోనూ రిపీట్ అవదన్న గ్యారెంటీ లేదు.
Angelo Mathews: ఇలాంటి ఆటగాళ్ళను ఎప్పుడూ చూడలేదు: ఏంజెలో మాథ్యూస్
1987 వరల్డ్ కప్ సెమీస్.. 2014 టీ-20 వరల్డ్ కప్ ఫైనల్.. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. 2015 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్.. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్.. 2016 టీ-20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్.. 2022 టీ-20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ గండాలను భారత్ దాటలేకపోయింది. ఈ మ్యాచులు ఇప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ కళ్లముందు కదులుతుంటాయి. ఈ అనుభవాలే ఇప్పుడు కలవరపెడుతున్నాయి. 1983లో తొలిసారి వరల్డ్ కప్‌ను ముద్దాడింది భారత్. అదే జోష్‌ను 1987 వరల్డ్ కప్‌లోనూ కొనసాగిస్తూ.. ఆడిన 6 మ్యాచుల్లో ఐదు మ్యాచుల్లో గెలిచి గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది. వరుసగా 5 విజయాలతో సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భారత్.. సెమీస్‌లో బొక్కబోర్లా పడింది. ఇంగ్లండ్ చేతిలో 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. 254 పరుగుల టార్గెట్‌ను చేధించలేక 219 పరుగులకే ఆల్‌ఔట్ అయ్యింది.
2014 టీ-20 వరల్డ్ కప్‌లోనూ ఇదే సీన్..! ఆడిన 4 మ్యాచుల్లో నాలుగూ గెలిచి గ్రూప్-2 టాపర్‌గా నిలిచింది భారత్. పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా టీమ్స్‌ను వరుసపెట్టి ఓడించి సెమీస్ చేరింది. సెమీస్‌లోనూ సౌతాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ చేరింది. తీరా.. ఫైనల్‌లో శ్రీలంక చేతిలో చిత్తైంది. 6 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. 2015 వన్డే వరల్డ్ కప్..! గ్రూప్-బీ లో ఉన్న భారత్… లీగ్ దశలో ఆడిన 6 మ్యాచుల్లో ఆరూ నెగ్గింది. గ్రాండ్‌గా సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంత స్పీడ్‌గా సెమీస్‌లోకి అడుగుపెట్టిందో.. అంతకంటే దారుణంగా ఆస్ట్రేలియా చేతిలో సెమీస్‌లో ఓడిపోయింది భారత్. ఏకంగా 95 పరుగుల తేడాతో ఓడి చిత్తయ్యింది. 2016 టీ-20 వరల్డ్ కప్..! లీగ్ దశలో ఆడిన 4 మ్యాచుల్లో 3 గెలిచి సెమీస్ చేరింది టీం ఇండియా. తీరా.. సెమీస్‌లో బొక్కబోర్లా పడింది. వెస్టిండీస్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది భారత్. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ..! గ్రూప్-ఏ లో ఉన్న భారత్ లీగ్ దశలో ఆడిన 3 మ్యాచుల్లో రెండు గెలిచి సెమీస్ చేరింది. సెమీస్‌లో బంగ్లాను 9 వికెట్ల తేడాతో చిత్తుచేసి ఫైనల్ మనదే అనిపించింది. కానీ.. ఫైనల్‌లో పాకిస్తాన్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది.
Sara Tendulkar: డీప్ ఫేక్ టెక్నాలజీ బారిన పడ్డ మరో సెలబ్రిటీ జంట.. మార్ఫింగ్ ఫొటో వైరల్..
2019 వన్డే వరల్డ్ కప్..! 15 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచి సెమీస్ చేరింది టీం ఇండియా. కానీ.. సెమీస్ గండం దాటలేకపోయింది. న్యూజిలాండ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. న్యూజిలాండ్ పెట్టిన 239 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక చేతులెత్తేసింది. జడేజా 77 పరుగులు, ధోనీ హాఫ్ సెంచరీతో చెలరేగుతుంటే.. ఫైనల్ భారత్ దే అనిపించింది. అప్పుడు భారత్ ముందుంది 23 పరుగుల టార్గెట్ మాత్రమే. కానీ.. ధోనీ రనౌట్ భారత్ కొంపముంచింది. 18 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయి సెమీస్ గండాన్ని దాటలేకపోయింది.
ఈ అనుభవాలను గుర్తు చేసుకుంటే.. క్రికెట్ ఫ్యాన్స్‌లో ఒకటే కలవరం..! భారత్ సెమీస్ గండం దాటుతుందా..? అని. ఈ టోర్నీలో 428 పరుగులు చేసిన సఫారీలను సైతం రఫ్ఫాడించిన రోహిత్ సేనపై భారీ అంచనాలే ఉన్నాయి. లీగ్ దశలో సౌతాఫ్రికాపై గెలిస్తే చాలు.. టోర్నీ మనదే అనుకున్నారు టీం ఇండియా ఫ్యాన్స్. కానీ.. భారత్ ఆటతీరును చూస్తుంటే ఓవైపు గర్వంగా ఉన్నా.. ప్రతీ ఒక్కరి మదిలో ఉన్నది మాత్రం సెమీస్ గండం గురించే. ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తే టీమిండియాను ఓడించే టీమ్ కనిపించడం లేదు. 2014 నుంచి 2022 వరకు జరిగిన అన్ని ఐసీసీ టోర్నీల్లోనూ గ్రూప్ దశలో భారత్ ఇదే స్థాయిలో దూసుకెళ్తోంది. అప్పుడు కూడా భారత్‌ను ఓడించే టీమ్ కనిపించలేదు. కానీ.. 2013 చాంపియన్స్ ట్రోఫీ.. తర్వాత భారత్ ఏ ఒక్క ఐసీసీ టైటిల్ సాధించలేకపోయింది. ప్రతిసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగడం సెమీస్‌లోనో.. ఫైనల్‌లోనో చేతులెత్తేయడం కామన్‌గా మారుతోంది.