TEAM INDIA: మళ్లీ నెంబర్ వన్‌గా టీమిండియా.. కివీస్ ఓటమితో రోహిత్ సేనకు టాప్ ప్లేస్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగలి ఉండగానే 3-1తో కైవసం చేసుకున్న భారత్.. 64.58 విజయాల శాతంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 03:03 PM IST

TEAM INDIA: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ ఘోర పరాజయం.. భారత్‌కు కలిసొచ్చింది. ఆదివారం ముగిసిన టెస్ట్‌లో ఆస్ట్రేలియా 172 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. దాంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగలి ఉండగానే 3-1తో కైవసం చేసుకున్న భారత్.. 64.58 విజయాల శాతంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

Rishabh Pant: పంత్‌కు ఫిట్‌నెస్ టెస్ట్ ఆరోజే.. వికెట్ కీపర్ రీఎంట్రీపై దాదా కీలక వ్యాఖ్యలు

ఆసీస్‌తో తొలి టెస్ట్ ముందు వరకు అగ్రస్థానంలో ఉన్న కివీస్ 60 శాతం విన్నింగ్ పర్సంటేజీతో రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ సేన ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రెండు మ్యాచ్‌ల్లో ఓటమి, ఒక మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. కాగా 59.09 శాతంతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్ , ఇంగ్లండ్‌ మధ్య చివరి టెస్ట్ మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ విజయాల శాతం మరింత మెరుగువ్వనుంది.

ఓడితే మాత్రం మూడో స్థానానికి పడిపోయే ప్రమాదం ఉంది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్ ముగిసే సరికి టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడుతాయి. ఇప్పటికే భారత్ వరుసగా రెండు సార్లు ఫైనల్ చేరి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. తొలి ఎడిషన్‌లో న్యూజిలాండ్.. రెండో ఎడిషన్‌లో ఆసీస్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. కనీసం ఈసారైనా టెస్ట్ గదను అందుకోవాలని భావిస్తోంది.