T20, Indian : టీమిండియాపై కోట్లాభిషేకం.. భారత్ కు వచ్చిన నజరానా ఎంతో తెలుసా ?

సుధీర్ఘ నిరీక్షణ తర్వాత వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుపై కాసుల వర్షం కురుస్తోంది. ఐసీసీ ఇచ్చిన ప్రైజ్ మనీ కంటే 6 రెట్లు ఎక్కువగా బీసీసీఐ నజరానా ప్రకటిస్తే...తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నగదు బహుమతి ప్రకటించింది.

సుధీర్ఘ నిరీక్షణ తర్వాత వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుపై కాసుల వర్షం కురుస్తోంది. ఐసీసీ ఇచ్చిన ప్రైజ్ మనీ కంటే 6 రెట్లు ఎక్కువగా బీసీసీఐ నజరానా ప్రకటిస్తే…తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నగదు బహుమతి ప్రకటించింది. వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో ఉన్న ముంబై ఆటగాళ్ళను మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఘనంగా సత్కరించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, యశస్వి జైశ్వాల్ ను సన్మానించారు. ఈ సందర్భంగా వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు మహరాష్ట్ర సీఎం షిండే 11 కోట్లు నజరాగా ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకూ భారత్ జట్టుకు వచ్చిన ప్రైజ్ మనీ 150 కోట్లు దాటింది.

వరల్డ్ కప్ గెలిచినందుకు ఐసీసీ 20 కోట్లు ప్రైజ్ మనీగా అందజేస్తే… బీసీసీఐ ఏకంగా 125 కోట్లు నజరానాగా ప్రకటించింది. ఇప్పుడు మహరాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 11 కోట్లతో కలిసి ఇప్పటి వరకూ టీమిండియాకు 156 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా వచ్చినట్టైంది. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన టీమిండియా ఈ సారి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మాత్రం అదరగొట్టింది. ఒక్క ఓటమి లేకుండా జైత్రయాత్ర కొనసాగిస్తూ ఫైనల్లో సౌతాఫ్రికాను నిలువరించి 13 ఏళ్ళ తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. అలాగే 2007 తొలి టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ 17 ఏళ్ళకు పొట్టి ఫార్మాట్ లో విశ్వవిజేతగా నిలిచింది.