T20 match : తొలి టీ 20 మ్యాచు.. గెలిచినా ట్రోలింగ్ తప్పలేదు..

ఆసీస్ జరిగిన తొలి టీ 20 మ్యాచులో టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్‌గా ఆడుతున్న తొలి మ్యాచులోనే చెలరేగాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీసులో వెటరన్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వడంతో కుర్ర జట్టుకు అతన్ని కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

ఆసీస్ జరిగిన తొలి టీ 20 మ్యాచులో టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్‌గా ఆడుతున్న తొలి మ్యాచులోనే చెలరేగాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీసులో వెటరన్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వడంతో కుర్ర జట్టుకు అతన్ని కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టీ20లో స్కై.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. జోష్ ఇంగ్లిస్ భారీ శతకం, స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీతో రాణించారు. దీంతో ఆ జట్టు 202 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేజింగ్‌లో యశస్వి జైస్వాల్.. టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే జైస్వాల్, రుతురాజ్ ఇద్దరూ క్రీజులో ఎక్కువ సేపు నిలవలేదు.

World Cup : రషీద్ ఇకపై ఆడలేడా?

టీమిండియా కేవలం 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సమయంలో సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. ఆరంభంలో కొంత నెమ్మదిగా ఆడిన అతను.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎడాపెడా బౌండరీలతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతనికి ఎలా బౌలింగ్ వేయాలో కూడా కంగారూలకు అర్థం కాలేదు. ఈ క్రమంలోనే 42 బంతుల్లో 80 పరుగులు చేసిన సూర్య.. టీమిండియా గెలుపు ఖాయం అనుకున్న సమయంలో అవుటయ్యాడు. చివర్లో రింకూ సింగ్ మిగతా లాంఛనం పూర్తి చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ చూసిన ఫ్యాన్స్ అంతా కూడా సూర్యను తిట్టాలో, పొగడాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం కనుక సూర్య ఇదే తరహా ఇన్నింగ్స్ ఆడి ఉంటే.. వరల్డ్ కప్ భారత్‌కే దక్కేదని చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు. వరల్డ్ కప్ ఫైనల్‌లో పరమ చెత్తగా ఆడిన అతను.. తనకు అచ్చొచ్చిన టీ20 ఫార్మాట్‌లో మాత్రం చెలరేగుతున్నాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా సూర్య ఇన్నింగ్స్ మాత్రం నాలుగు రోజులు ఆలస్యమైందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.