RCB: ఎందుకు ఈ టీమ్.. అమ్మేయండి.. ఆర్సీబీపై టెన్నిస్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు

అధ్వానపు ఆటతీరును ప్రదర్శిస్తోన్న ఆర్సీబీపై కర్ణాటకకే చెందిన భారత మాజీ స్టార్ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతి తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఆర్సీబీ ఆటతీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని వ్యాఖ్యానించాడు.

  • Written By:
  • Publish Date - April 16, 2024 / 06:38 PM IST

RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ పరాజయాల పరంపర కొనసాగిస్తూనే ఉంది. తాజాగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే విజయం సాధించిన బెంగుళూరు పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. దీంతో ఆర్సీబీపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇలా అధ్వానపు ఆటతీరును ప్రదర్శిస్తోన్న ఆర్సీబీపై కర్ణాటకకే చెందిన భారత మాజీ స్టార్ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతి తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.

Glenn Maxwell: బెంగళూరుకు షాక్.. సీజన్ నుంచి తప్పుకున్న మాక్స్‌వెల్

ఆర్సీబీ ఆటతీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని వ్యాఖ్యానించాడు. ఇలాంటి ఆటతీరుతో ఐపీఎల్ సీజన్‌లో చివరి వరకూ నిలవలేదంటూ ఫైర్ అయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉందనీ, ఇలాంటి టైమ్‌లో బీసీసీఐ రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించాడు. ఆర్సీబీని కొత్త ఫ్రాంచైజీకి అమ్మే దిశగా మేనేజ్‌మెంట్ ఆలోచించాలన్నాడు. క్రికెట్, ఫ్యాన్స్, ఆటగాళ్ల కోసం ఆర్సీబీ అమ్మకం చేపట్టాల్సిన అవసరం ఉందన్నాడు. కొత్త మేనేజ్‌మెంట్ జట్టు కూర్పు, ఆటగాళ్ల ఎంపికపై శ్రద్ధ చూపిస్తుందని అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ ఆడుతున్న మిగిలిన జట్లలాగా పోటీతత్వంతో ఆడేలా తయారు చేయగలుగుతుందని పేర్కొన్నాడు. తన అభిప్రాయం కాస్త భిన్నంగా ఉన్నా.. కఠిన నిర్ణయం తీసుకోక తప్పదంటూ మహేశ్ భూపతి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం టెన్నిస్ దిగ్గజం చేసిన ఈ కామెంట్స్ ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.