Captain Gill : గిల్ కెప్టెన్సీకి పరీక్ష.. ప్రాక్టీస్ లో బిజీగా యంగ్ ఇండియా..

ఒకవైపు వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా స్వదేశం చేరుకుని సంబరాల్లో బిజీగా ఉంటే... మరోవైపు జింబాబ్వేతో సిరీస్ కోసం యంగ్ ఇండియా సిద్ధమవుతోంది.

ఒకవైపు వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా స్వదేశం చేరుకుని సంబరాల్లో బిజీగా ఉంటే… మరోవైపు జింబాబ్వేతో సిరీస్ కోసం యంగ్ ఇండియా సిద్ధమవుతోంది. శుభ్ మన్ గిల్ సారథ్యంలోని భారత యువ జట్టు ప్రాక్టీస్ లో బిజీగా బిజీగా ఉంది. హరారే వేదికగా శనివారం నుంచి భారత్ , జింబాబ్వే ఐదు మ్యాచ్ ల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కు తాత్కాలిక కెప్టెన్ గిల్ ను ఎంపిక చేశారు. అలాగే సీనియర్ ప్లేయర్స్ కు విశ్రాంతినిచ్చి ఐపీఎల్ లో సత్తా చాటిన పలువురు యువ ఆటగాళ్ళకు చోటు కల్పించారు.
అయితే ఈ సిరీస్ గిల్ కెప్టెన్సీకి పరీక్షగానే చెప్పాలి. చిన్న జట్టే కదా అనుకుని జింబాబ్వేను తేలిగ్గా తీసుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు.

పైగా ఫ్యూచర్ లో భారత కెప్టెన్సీ రేసులో ఉన్న గిల్ కు ఈ సిరీస్ మంచి అవకాశంగానూ చెప్పొచ్చు. యువ ఆటగాళ్ళతో కూడిన జట్టు సమర్థవంతంగా నడిపిస్తే టీ ట్వంటీ కెప్టెన్సీ రేసులో ముందంజ వేయొచ్చు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ను నడిపిస్తున్న గిల్ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటాడేమో చూడాలి. ఇదిలా ఉంటే శివమ్ దూబె, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ స్థానంలో జితేశ్ శర్మ, సాయి సుదర్శన్, హర్షిత్ రాణాలను తీసుకున్నారు. మొత్తం మీద ఐపీఎల్ ఫామ్ ను కొనసాగిస్తూ జాతీయ జట్టు తమ స్థానాలను సుస్థిరం చేసుకునేందుకు యువ క్రికెటర్లకు ఈ సిరీస్ గోల్డెన్ ఛాన్స్ గా చెప్పాలి.