T20, World Cup : ఆ బౌలర్ ను ఎంపిక చేయాల్సింది.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీ 20 (T20) వరల్డ్ కప్ (World Cup) కోసం సెలెక్టర్లు ప్రకటించిన జట్టపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ప్లేయర్స్ ను పక్కన పెట్టడంపై చర్చ జరుగుతోంది. తాజాగా సన్ రైజర్స్ బౌలర్ నటరాజన్ ను తీసుకోవాల్సింది అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అభిప్రాయపడ్డాడు.

టీ 20 (T20) వరల్డ్ కప్ (World Cup) కోసం సెలెక్టర్లు ప్రకటించిన జట్టపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ప్లేయర్స్ ను పక్కన పెట్టడంపై చర్చ జరుగుతోంది. తాజాగా సన్ రైజర్స్ బౌలర్ నటరాజన్ ను తీసుకోవాల్సింది అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అభిప్రాయపడ్డాడు. ఎంపిక చేసిన జట్టును చూస్తే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ప్లేయర్స్ ఫామ్ ను పరిగణలోకి తీసుకున్నట్లు స్పష్టమవుతోందన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) పేస్ బౌలర్ నటరాజన్ కూడా ఈ సీజన్లో రాణిస్తున్నాడు. ఇప్పటికే అతడు 7 మ్యాచ్ లలోనే 13 వికెట్లు తీసుకున్నాడు. డెత్ బౌలర్లలో చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడనీ గవాస్కర్ గుర్తు చేశాడు.

తక్కువ ఎకానమీ రేటు, ఒత్తిడిలోనూ మెరుగ్గా బౌలింగ్ చేసే సామర్థ్యం అతని సొంతమనీ, అతనికి చోటు కల్పించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. సెలెక్టర్లు ఎంపిక చేసిన సీమ్ బౌలర్లు అనుభవజ్ఞులనీ,. అందులో ఎలాంటి సమస్య లేదన్నాడు.నిజానికి నటరాజన్ ను ఎంపిక చేస్తారని చాలా మంది భావించారు. అతనితోపాటు మరో సన్ రైజర్స్ ప్లేయర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) కు కూడా అవకాశం లభిస్తుందని భావించినా.. అదీ జరగలేదు. జట్టులోకి మరో లెఫ్టామ్ పేస్ బౌలర్ గా అర్ష్‌దీప్ సింగ్ ను తీసుకున్నారు. అతనితోపాటు బుమ్రా, సిరాజ్ పేస్ బౌలర్లుగా ఎంపిక చేశారు.