స్పిన్ లో తడబాటు అందుకే… మాజీ ఓపెనర్ హాట్ కామెంట్స్

ఆసియా దేశాలకు చెందిన క్రికెటర్లు స్పిన్ బాగానే ఆడతారు.. ముఖ్యంగా భారత బ్యాటర్లు స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటారు..స్పిన్ దిగ్గజాలు మురళీధరన్, షేన్ వార్న్ ను సైతం మన బ్యాటర్లు డామినేట్ చేసిన సందర్భాలున్నాయి.

  • Written By:
  • Publish Date - September 6, 2024 / 08:37 PM IST

ఆసియా దేశాలకు చెందిన క్రికెటర్లు స్పిన్ బాగానే ఆడతారు.. ముఖ్యంగా భారత బ్యాటర్లు స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటారు..స్పిన్ దిగ్గజాలు మురళీధరన్, షేన్ వార్న్ ను సైతం మన బ్యాటర్లు డామినేట్ చేసిన సందర్భాలున్నాయి. అయితే గత కొంతకాలంగా స్పిన్ బౌలింగ్ లో మన వాళ్ళు తడబడుతున్నారని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఇటీవల లంకతో సిరీస్ నే ఉదాహరణగా చెప్పాడు. దీనికి కారణాన్ని కూడా సెహ్వాగ్ వెల్లడించాడు. దేశవాళీ క్రికెట్ ఆడకపోవడం వల్లనే టీమిండియా బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌కు తడబడుతున్నారని తేల్చేశాడు. తాము జాతీయ జట్టులో ఉన్నప్పుడు సమయం దొరికితే దేశవాళీ క్రికెట్ ఆడిన రోజులను సెహ్వాగ్ గుర్తు చేశాడు. ప్రస్తుతం బిజీ షెడ్యూల్ తో సీనియర్ క్రికెటర్లకు కుదరడం లేదన్నాడు.

ఇక టీట్వంటీ క్రికెట్ ఎక్కువగా ఆడటం వల్ల నాణ్యమైన స్పిన్నర్లు రావడం లేదన్నాడు.పొట్టి క్రికెట్ లో కేవలం 24 బంతులు మాత్రమే వేసే అవకాశం ఉంటుందని, దాంతో స్పిన్నర్లు బంతిని ఫ్లైట్ చేసి వేసే అవకాశం ఉండదని వీరూ చెప్పుకొచ్చాడు. బ్యాటర్లను ఔట్ చేసే బంతుల కంటే డాట్స్ చేయడంపైనే స్పిన్నర్లు ఎక్కువగా ఫోకస్ పెట్టారని విశ్లేషించాడు. దీంతో బ్యాటర్లను ఔట్ చేసే నైపుణ్యం సాధించడం స్పిన్నర్లకు కష్టంగా మారిందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.