అందుకే మీరు జెంటిల్మెన్ బ్లాంక్ చెక్కులు రిజెక్ట్ చేసిన ద్రవిడ్

రిటైర్మెంట్ తర్వాత కూడా కోట్లలో ఆదాయం వచ్చేది మన దేశంలో క్రికెటర్లకు మాత్రమే...కామెంటేటర్ గా , కోచ్ గా, మెంటార్ గా ఇలా చాలా ఆప్షన్సే ఉంటాయి. కొందరు డబ్బు కోసమే పనిచేసే వాళ్ళుంటే మరికొందరు హోదా కోసం పనిచేస్తారు.

  • Written By:
  • Publish Date - September 9, 2024 / 06:19 PM IST

రిటైర్మెంట్ తర్వాత కూడా కోట్లలో ఆదాయం వచ్చేది మన దేశంలో క్రికెటర్లకు మాత్రమే…కామెంటేటర్ గా , కోచ్ గా, మెంటార్ గా ఇలా చాలా ఆప్షన్సే ఉంటాయి. కొందరు డబ్బు కోసమే పనిచేసే వాళ్ళుంటే మరికొందరు హోదా కోసం పనిచేస్తారు. చాలా కొద్దిమంది మాత్రం గతంలో తమకు మధ్ధతుగా నిలిచిన వారి కోసం బాధ్యతలు తీసుకుంటారు. ఈ కోవలోకే వస్తాడు టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్… భారత క్రికెట్ జట్టు కోచ్ గా పదవీకాలం ముగిసిన తర్వాత అతని సేవల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు గట్టిగానే ప్రయత్నించాయి. కోచ్ గా లేదా మెంటార్ గా ఉండాలంటూ ఏకంగా బ్లాంక్ చెక్కులు ఆఫర్ చేశాయి. కానీ ద్రవిడ్ డబ్బుల కోసం పనిచేసే వ్యక్తి కాదు.. విలువలతో ఉండే గొప్ప ప్లేయర్… రెండు మూడు ఫ్రాంచైజీలు ఆఫర్ చేసి బ్లాంక్ చెక్కులను సున్నితంగా తిరస్కరించి తాను డబ్బులకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వనంటూ చెప్పకనే చెప్పాడు.

తనను కష్టకాలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టులోకి తీసుకున్న రాజస్థాన్ కే పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఐపీఎల్ లో తొలి మూడు సీజన్లు ద్రవిడ్ బెంగళూరు జట్టుకు ఆడాడు. 2011 సీజన్ వేలంలో ద్రవిడ్ ను ఆర్సీబీ వదిలేయగా.. ఇతర ఫ్రాంచైజీలు కూడా పట్టించుకోలేదు. అమ్ముడుకాకుండా మిగిలిపోతే ద్రవిడ్ లాంటి దిగ్గజానికి అది అవమానమే. అలాంటి సమయంలో రాజస్థాన్ రాయల్స్ ది వాల్ ను వేలంలో తీసుకుంది. అప్పటి నుంచీ ప్లేయర్ గానూ, కెప్టెన్ గా , మెంటార్ గా సేవలందించాడు. ఇప్పుడు మరోసారి తన పాత జట్టుతోనే రిలేషన్ షిప్ కొనసాగించేందుకు బ్లాంక్ చెక్కులను సైతం తీసిపారేసాడు. అందుకే ద్రవిడ్ జెంటిల్మెన్ అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.