టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ను విజేతగా నిలిపిన క్యాచ్ కు అరుదైన గౌరవం దక్కింది. టోర్నీలోనే ఇది అత్యుత్తమ క్యాచ్ గా నమోదైంది. సౌతాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో సూర్య స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్ ను మలుపుతిప్పాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్‌లో ఫుల్‌టాస్‌గా వేసిన తొలి బంతిని డేవిడ్ మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్ దగ్గర సూర్యకుమార్ అద్భుతంగా బంతిని అందుకున్నాడు. ఒకవేళ ఇది సిక్సర్ అయ్యింటే సౌతాఫ్రికా గెలిచేది.
సూర్యకుమార్ అందుకున్నది క్యాచ్ కాదని వరల్డ్ కప్ అంటూ విమర్శకులు సైతం ప్రశంసించారు. దీంతో ఈ ఎడిషన్ లో బెస్ట్ క్యాచ్ ఇదేనని ఐసీసీ తెలిపింది. సూర్య క్యాచ్‌ను టీ20 ప్రపంచకప్ 2024 అత్యుత్తమ క్యాచ్‌ల జాబితాలో చేర్చినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో స్టన్నింగ్ క్యాచ్‌ల వీడియోను ఐసీసీ అభిమానులతో పంచుకుంది. అయితే సూర్యకుమార్ క్యాచ్ పై పలువురు పాక్ మాజీలు విమర్శలు చేశారు. సూర్య బౌండరీ లైన్ తాకాడని, బౌండరీ లైన్‌ను వెనక్కు జరిపారని విమర్శించినా అవన్నీ తప్పని తేలిపోయింది.