Shubman Gill : శుభ్‌మన్ గిల్ ఉంటాడా? ఊడతాడా?

ఐసీసీ ప్రపంచ కప్ 2023లో భారత జట్టు బోణీ కొట్టింది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని 41.2 ఓవర్లలో ఛేదించింది. కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక టీమిండియా తన తదుపరి మ్యాచ్ ఆఫ్ఘానిస్తాన్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ వేదిక జరగనుంది. బుధవారం జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నారు.

ఈ మ్యాచ్ తర్వాత, అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్ తో మ్యాచ్ షెడ్యూల్ లో ఉంది. మొన్నటికి మొన్న ఆసియాకప్‌లో టీమిండియా చేతిలో చావుదెబ్బలు తిన్న అనుభవం ఉన్నందున పాకిస్తాన్ జట్టు భారత్‌పై ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది. ఈ పరిస్థితుల్లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. డాషింగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. ఆసుపత్రి పాలయ్యాడు. కొద్దిరోజులుగా డెంగ్యూ ఫీవర్‌తో అతను బాధపడుతున్నాడు. డెంగ్యూ తీవ్రత తగ్గినప్పటికీ.. విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నందున పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు తుదిజట్టులో అతనికి చోటు దక్కకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి.

దీనితో- శుభ్‌మన్ గిల్ స్థానంలో తుదిజట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను కొనసాగించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లోనూ అతన్ని ఆడించవచ్చు జట్టు మేనేజ్‌మెంట్. రోహిత్ శర్మతో పాటు అతను ఇన్నింగ్‌ను ఆరంభించవచ్చు. ఆస్ట్రేలియాపై గోల్డెన్ డక్ నమోదు చేశారు ఇషాన్ కిషన్. ఎదుర్కొన్న తొలి బంతికే స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడీ లెఫ్ట్ హ్యాండర్. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో, బాగా ఆడితే ఎలాంటి అడ్డంకులు ఉండవు కానీ, విఫలమైతే మాత్రం ఆల్టర్నేటివ్‌ను వెదుక్కోక తప్పదు.