టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు (Indian Cricketers) పై మిశ్రమ స్పందన వస్తోంది. పలువురు యువ ఆటగాళ్ళకు చోటు దక్కలేదు. ముఖ్యంగా కొంత కాలంగా ఫినిషర్‌గా అద్భుతంగా రాణిస్తున్న రింకూ సింగ్ కచ్చితంగా టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) టీమ్‌లో ఉంటాడని అంతా భావించారు. అయితే సెలెక్టర్లు కేవలం స్టాండ్ బై ప్లేయర్స్ లో ఒకడిగా అతన్ని తీసుకున్నారు.
ఈ విషయంపై క్రికెట్ అభిమానులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు రింకూ కూడా చాలా బాధ పడ్డాడు. ఇదిలా ఉంటే ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) నేరుగా ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియానికి (Wankhede Cricket Stadium) వెల్లాడు. అక్కడ నెక్ట్స్ మ్యాచ్ ఆడేందుకు ప్రాక్టీస్ చేస్తున్న కోల్‌కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆటగాళ్లను పలకరించి మాట్లాడాడు.
ఈ క్రమంలోనే రింకూ సింగ్‌ను కాస్త పర్సనల్‌గా కలిసి, అతన్ని ఓదార్చినట్లు తెలుస్తోంది.
టీమిండియా (Team India) కెప్టెన్‌గా, ఒక సీనియర్ ప్లేయర్‌గా రోహిత్ శర్మ.. అతనితో మాట్లాడి, నీకు చాలా ఫ్యూచర్ ఉంది, నువ్వు భవిష్యత్తులో ఎంతో సాధిస్తావ్ అంటూ అతన్ని కాస్త మోటివేట్ చేసినట్లు సమాచారం. సాధారణంగా రోహిత్ శర్మ యువ క్రికెటర్లకు ఎక్కువ అవకాశం ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటాడు. కానీ, వరల్డ్ కప్ టీమ్‌లో అన్ని ప్లేస్‌లు ఫిల్ అయిపోవడం, ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉండటంతో.. ఫినిషర్‌గా ఉన్న రింకూ సింగ్‌కు వరల్డ్ కప్ టీమ్‌లో చోటు లేకుండా పోయింది. అయితే.. ఎంపిక కానీ రింకూ సింగ్‌తో రోహిత్ మాట్లాడిన తీరుపై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది.